పట్టిసీమ వరమా..? వృధానా..?

Pattisema Project will benefit or waste to AP People

ఏపిలో తలెత్తిన రాజకీయ ప్రతిష్టంబనను కాస్త తగ్గించే ప్రయత్నంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.  ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఒక సవాల్ గా చేపట్టిన ప్రాజెక్టు పట్టిసీమ. రైతుల కోసం చేపట్టిన ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు పట్టిసీమ ప్రాజెక్టుకు ఏపికి మేలు చేస్తుందా..? చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆంధ్రులకు ఈ ప్రాజెక్టు వరధాయిని అవుతుందా..? లాంటి అనేక ప్రశ్నలకు ఈ ఆర్టికల్ ద్వారా సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

వరమే ఎలా అంటే…  
తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఏపి ఒక నీటి చుక్కను కూడా వృధా కాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని అలా సముద్రంపాల్జేయకుండా నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో భాగంగా కాల్వలను తవ్వి.. అలా వచ్చిన కృష్ణా నీటిని గోదావరితో కలిపి సాగు భూములకు మరింత సహకారాన్ని అందిస్తుంది. అలాగే పట్టిసీమ కాలువల ద్వారా అక్కడి చుట్టుపక్కలి గ్రామాలకు నీటిని పంపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీని వల్ల మెయిన్ కెనాల్ తో పాటుగా పక్కనున్న అన్ని గ్రామాలకు చిన్న చిన్న పైపుల ద్వారా సాగునీరు అందుతోంది.

అలాగే పట్టిసీమ నీటి కాలువలు ఎంత వరకు ఉంటే అంత వరకు దాదాపుగా 50-60 ఫీట్ల రోడ్లను వేస్తున్నారు. కాల్వలను తవ్వడం వల్ల వచ్చిన మట్టిని అదే కాల్వల పక్కన వేస్తున్న రోడ్లకు వాడుతున్నారు. ఇలా పట్టిసీమ వల్ల ఓ పక్కన నీరు అందడంతో పాటుగా, పట్టిసీమ కాలువల వెంట రవాణా వ్యవస్థను కూడా పటిష్టపరచడం జరుగుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సముద్రంలో కలుస్తున్న నీటిని దాదాపుగా కట్టిడిచేస్తున్నట్లే. అందుకే ఏపి సర్కార్ పట్టిసీమ ఏపి ప్రజలకు ఓ వరం అని బల్లగుద్ది చెబుతున్నారు.

వృధా ఎందుకంటే..
ఏపి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు సర్కార్ వాదనలతో విభేదిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ తన వాదనను గట్టిగా వినిపించారు. సర్కార్ చెప్పినవన్నీ అబద్దాలే కావాలంటే తనతో వాదనకు ప్రభుత్వం తరఫున ఎవరైనా ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ ను టార్గెట్ చేసిన ఉండవల్లి మరోసారి ఆధారాలతో రెచ్చిపోయారు. చంద్రబాబు సర్కార్ చేపడుతున్న పట్టిసీమ వట్టిసీమ అని, అంతా వృదా అని అన్నారు. అసలు ఉండవల్లి ప్రకారం పట్టిసీమ ఎందుకు వట్టిసీమ అవుతోంది అంటే..

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపి ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి, చేస్తున్న ఖర్చుకు ఏమాత్రం పొంతనలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఏపి సర్కార్ పట్టిసీమ కోసం అదనంగా నాలుగు వందల కోట్లను కేటాయించింది అని అది ప్రజాధనం అని, అది వృదాగా చేస్తున్న ఖర్చు అని ఆయన అన్నారు. కేవలం 80 టీఎంసీల నీళ్లను ఎత్తిపొయ్యడానికి 1600 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. అంత ఖర్చు పెట్టి చేసేది కేవలం 80 టీఎంసీ నీళ్లను మాత్రమే ఎత్తిపొయ్యడం అంటే కేవలం సర్కస్ ఫీట్లలాంటివి అన్న చందంగా ఉండవల్లి అభివర్ణించారు.

పట్టిసీమ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం సముద్రంలోకి వృధాగా వెళుతున్న నీటిని సాగునీటి కాల్వల ద్వారా పంటపొలాలకు మళ్లించడం. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం వందకు వంద శాతం అది కాదు. కృష్ణా జలాలను, గోదావరి కాల్వలకు మళ్లించినా కానీ సముద్రంలోకి కలుస్తున్న నీటిని అడ్డుకోవడంలో మాత్రం పట్టిసీమ ప్రజెక్టు విఫలమైందని అన్నారు. గత ఆరు సంవత్సరాల లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం కృష్ణ, గోదావరికి వస్తున్న వరదలను అడ్డుకట్ట కట్టి.. ఆ నీటిని సాగు భూములకు మళ్లించాలి. వరద నీరు కూడా ఎక్కవైతే అప్పుడు ఆ నీటిని సముద్రంలోకి వదిలేస్తారు. కానీ పట్టిసీమ ప్రాజెక్టు ఓకే చేసినప్పటి నుండి ఇప్పటి వరకు సముద్రంలో కలుస్తున్న నీటిని అడ్డుకున్న దానికన్నా వృధాగా వదిలేసిన నీళ్లే ఎక్కువ. దీన్ని ఉండవల్లి ప్రశ్నించారు. ఇంత చేసినా చివరకు సముద్రంలో కలుస్తున్న నీటిని మాత్రం అడ్డుకోవడంలో విఫలమయ్యారని.. అందుకే పట్టిసీమ వట్టిసీమ.. అంతా వృధా అని ఉండవల్లి అరుణ్ కుమార్ వాదిస్తున్నారు. మొత్తంగా ఏపిలో పట్టిసీమ నిజంగా వరమా..? వృధానా అంటే మాత్రం.. రైతులకు నీరు అందిస్తున్న తీరులో మాత్రం వరం. నీళ్లను సముద్రంపాలుచెయ్యడం, మితిమీరిన ఖర్చు చెయ్యడంలో మాత్రం వృధా.

 

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
చిరుకు పవన్ అందుకే దూరం
ప్రత్యేక హోదా లాభాలు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తొక్కితే తాటతీస్తారు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
మీకో దండం.. ఏం జరుగుతోంది?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
జయ మరణం వెనక ఆ మాఫియా?
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments