పవర్ స్టార్ గా తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ప్రజల్లోకి వచ్చేశాడు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి క్రియాశీలంగా మారేందుకు.. వచ్చే ఎన్నికల నాటికి ఎన్నికల్లో పోటీకి కూడా సిద్దమవుతున్నారు పవన్ కళ్యాణ్. మరి అలాంటి పవన్ గురించి ఆసక్తికరమైన ఓ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటా ఆసక్తికర వ్యాఖ్య అనుకుంటున్నారా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవియే రాజగకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారని, పవన్ పార్టీ పెట్టినా నిలవడం సాధ్యం కాదు అనే వార్త.
ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఎవరో కాదు.. నారా, నందమూరి కుటుంబాలకు దగ్గరి చుట్టం దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. అవును పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మరి లక్ష్మీ పార్వతి ఎప్పుడూ చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసి వ్యాఖ్యలు చేస్తారు అని అందరికి తెలుసు. కానీ ఈ సారి మాత్రం పవన్ కూడా తన వ్యాఖ్యల్లో ప్రస్తావించడంతో వార్తల్లో నిలిచారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు, మోదీకి పవన్ మద్దతు పలికారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. మరి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యల్లో ఎంత వరకు నిజం ఉందో ఆమెకే తెలియాలి.