చిరుకు పవన్ అందుకే దూరం

Chiru-pawan-distance

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. వెండి తెర మీద పవర్ స్టార్ గా ఎంతో పరిచయం అక్కర్లేని ఈ మెగా హీరో వ్యవహారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పొలిటికల్ లీడర్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా డిఫరెంట్ గా ఉంటున్నారు అంటే దానికి ఓ కారణం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటో తెలుగోడ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కానీ తర్వాత మాత్రం పవన్ చిరుకు దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి వెంట నడిచిన పవన్.. చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత మాత్రం అంటీ ముట్టన్నట్లు ఉంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని గమనించాలి. ఆయన మనోభావాలకు వ్యతిరేకంగా చిరు నడుచుకున్నారనో లేదంటే పొలిటికల్ గా చేపట్టిన సిద్ధాంతాన్ని పక్కనపెట్టినందుకో తెలియదు కానీ మొత్తానికి పవన్ అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తే అయినా బయటి వ్యక్తిగా ఉంటున్నారు అని వార్త.

తర్వాత పరిస్థితులు మారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో ఓ పొలిటికల్ పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మరొ కొత్త పార్టీకి అంకురార్పణ చేశారు. పార్టీ పెట్టిన కొత్తలో తెలుగు రాష్ట్రాల్లో తెగ హడావిడి చేశారు. అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు తెలిపారు. కానీ తర్వాత ఒక్కసారి కూడా రాజకీయంగా అడుగుముందుకు వెయ్యలేదు. అమరావతి పేరుతో భూములు లాక్కున్నప్పుడు మాత్రం ఒక్కసారి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. మళ్లీ తర్వాత జరిగిన ఒక్క ఘటనపైన కూడా ఆయన మారుమాట మాట్లాడలేదు.

రోహిత్ వేముల ఆత్మహత్య దగ్గరి నుండి ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటం వరకు ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీనికి ఒక్కటే కారణం ఓ వర్గానికి ఆయన అనుకూలంగా మాట్లాడితే మరో వర్గం దూరమవుతుంది అనే ఆలోచనతోనే ఏ ప్రకటనా చెయ్యలేదు అని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ విషయానికి వచ్చినా కూడా పవన్ ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. దాన్ని కాంగ్రెస్ లో కలపడం వల్ల పొలిటికల్ గా చిరుకు బ్యాడ్ నేమ్(చెడ్డపేరు) వచ్చింది. చిరంజీవి వల్ల తన పొలిటికల్ కెరీర్ దెబ్బతినకుండా ఉండేందుకే చిరుతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కు చిరు వెళ్లారు. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు కూడా చిరు హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చిరుతో కలవడంలేదు. చిరంజీవి కూతురి పెళ్లికి, చిరు పుట్టిన రోజు వేడుకులకు కూడా పవన్ ఇందుకే దూరంగా ఉన్నాడు అని తెలుస్తోంది. చిరంజీవితో పవన్ కు ఎంతో మంచి అనుబంధం ఉంది. కానీ తనకు(పవన్) పొలిటికల్ గా మైనస్ అవుతుంది కాబట్టే చిరు నుండి దూరంగా ఉంటున్నారు అని తెలుస్తోంది. కానీ తన అన్నతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ.. తన భార్యను చిరు ప్రతి ఫంక్షన్ కు పంపిస్తున్నారు అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుండి ఎంతో స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. కానీ జనాలకు మాత్రం అది కనిపించని విధంగా చేస్తున్నారు. ఎన్నికల టైంలో ఆయన ప్రచారం నిర్వహించడం.. మోదీతో క్లోజ్ గా మూవ్ కావడం, చంద్రబాబును ఆకాశానికెత్తడం, ముద్రగడ విషయంలో ప్రకటన చెయ్యకపోవడం ఇలా ప్రతి విషయంలో పవన్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఎలాంటి మచ్చలేకుండా.. లీడర్ గా బరిలోకి దిగాలని దూరదృష్టితో పవన్ఎవరి ఊహకు అందని విధంగా ముందుకు సాగుతున్నారు.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
బాబు Khan
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments