వెనకడుగు

Pawan Kalyan Backstep On Special Status Fight

Pawan Kalyan Took Backstep On Special Status Fight. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

కాకినాడ బహిరంగ సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం ఉత్తరాధి నేతల అహంకారంపైనే సాగింది. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం అని బ్యానర్ పెట్టుకుని ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక్కడ తనని ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రత్యేక హోదాపై తన మూడెంచెల ప్రణాళిక గురించి మాట్లాడలేదు సరికదా దాన్ని పక్కనపెట్టారు. మరొక విషయం ఏమిటంటే.. తనకు బంద్‌లు చేయడం ఇష్టం లేదని చెప్పారు. ప్రజలు వారి పనులు చేసుకోవాలని, ప్రజల ఆస్తి ధ్వంసం చేసి నష్టం చేకూర్చకూడదని హితువు పలికారు. 10వ తారీఖునాడు వైసీపీ పిలుపునిచ్చిన బంద్‌కు తాను వ్యతిరేకిని కాదని, అందులో పాల్గొనడం మీ ఇష్టమని బహిరంగ సభకి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి అన్నారు. పోరాట బాధ్యత కేవలం రాజకీయ నేతలదని చెప్పారు. తన బాధ్యత వారిపై ఒత్తిడి తీసుకురావడమని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఎంతసేపూ చరిత్రను చెబుతూ.. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా ఉత్తరాది నేతలు భంగపరుస్తూ వస్తున్నారో వివరించారు. ప్రత్యేకహోదాని గుర్తుచేస్తూ.. తన ప్రాణాలు అడ్డుపెట్టి టీడీపీకి, భాజాపాకి ప్రచారం చేశానని, దాని పర్యావసానం ఇది కాదని ఆవేదన వ్యక్తపరిచారు. ఏదిఏమైనప్పటికీ.. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాలకి ప్రజల కోసం తను నిలబడతానని గట్టిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం ప్రకటించడం, దాన్ని చంద్రబాబు ఆహ్వానించడం, దానికి నిరసనగా వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వడం, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పవన్ తన ప్రణాళికను మార్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. భవిష్యత్తు కార్యాచరణాలేవీ ప్రకటించకుండానే పవన్ ఈ ప్రసంగాన్ని ముగించడం ద్వారా హోదాపై తన పోరాటానికి వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
చిరుకు పవన్ అందుకే దూరం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
చంద్రుడి మాయ Diversion Master
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments