కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని

Pawan Kalyan became copycat to YS Jagan

తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ గా పేరున్న పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో బిజీగా ఉన్నా కానీ రాజకీయ మీద మక్కువతో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు అని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించి.. అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ నినదించారు. ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తెలుగుదేశం, బిజెపి పార్టీ కూటమికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఎన్నికలు ముగిశాయి.. పవన్ మద్దతిచ్చిన తెలుగుదేశం, బిజెపి రెండూ అధికారంలోకి వచ్చాయి. ఇదంతా గతం.

ఇప్పుడు పవన్ క్రియాశీల రాజకీయాలకు ముందుకు కదులుతున్నారు. అయితే అలా కదిలే క్రమంలోనే ఆయన ఏం చెయ్యాలో అర్థం కాక చివరకు కాపీ క్యాట్ లా మారాడు అని తెలుస్తోంది. అదేంటి కాపీ క్యాట్ లా మారడం.. అది కూడా రాజకీయాల్లో ఎలా అని అనుకుంటున్నారా..? సావధానంగా చదవండి మీకు కూడా అర్థమవుతుంది. మామూలుగా హిట్ రాకపోతే పవన్ ఏదో ఒక హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ అందుకుంటాడు. పవన్ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు అలాంటివే. తాజాగా చేస్తున్న కాటమరాయుడు సినిమా కూడా కాపీ క్యాటే. కాగా ఇక్కడ పవన్ సినిమాలకు, రాజకీయాలకు పెద్దగా తేడా చూపించడం లేదు.

సినిమాల్లో చేసినట్లే రాజకీయాల్లో కూడా చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో జనసేపపార్టీని స్థాపించిన తర్వాత ఎన్నికల్లో ప్రచారం మినహా పవన్ ఎలాంటి రాజకీయ అడుగులు వెయ్యలేదు. కానీ పవన్ మీద అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో పవన్ ప్రచారానికి వస్తే.. కవిత చేసిన కామెంట్ ఎవరూ మరిచిపోలేరు. పవన్ లాంటి వాళ్లు ఎన్నికల టైంలో రంగులు పూసుకొని వస్తారు.. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్యాకప్ చెప్పి వెళతారు అని అన్న మాటలు నిజంగానే పవన్ కు వర్తిస్తాయి. కాగా పవన్ రాజకీయంగా ఎదగాలంటే ఏం చెయ్యాలో అర్థం కాక చివరకు సినిమాల్లో చేసినట్లే ‘కాపీ’ చేస్తే సరిపోతుంది అని నిర్ణయించుకొని.. మొత్తానికి కాపీ క్యాట్ లా మారారు.

తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజానికి పాపులార్టీ ఉన్న స్టారే కానీ రాజకీయాల్లో ఆయన ఓ కాపీ క్యాట్. అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని కాపీ కొడుతున్నారు అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. దానికి ఒకటే సమాధానం అదే.. వైసీపీ అధినేత వైయస్ జగన్. అవును పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ ను ఫాలో అవుతున్నాడు. కానీ ఫాలో అవ్వడం వరకు అయితే ఓకే కానీ ఆయన చేసినట్లే అన్నీ కాపీ చేస్తూ కాపీ క్యాట్ అనిపించుకుంటున్నారు.

పవన్ ను కాపీ క్యాట్ అని ఎలా అంటారు..? అంటే దానికి కూడా సమాధానాలున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది.. పవన్ ఎత్తుకున్న ప్రత్యేక హోదా అంశం. విభజన తర్వాత నుండి వైసీపీ అధినేత జగన్ ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎన్నికల టైంలో ఏం మాట్లాడకుండా.. తర్వాత రెండున్నరేళ్లు అధికార పార్టీ నిర్లక్షంగా వ్యవహరించిన తర్వాత వచ్చి.. ప్రత్యేక హోదా రాగం ఎత్తుకున్నారు.

అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని పెద్దగా పట్టించుకోని టైంలోనే జగన్ ప్రత్యేక హోదా వాదాన్ని బలంగా వినిపించారు. అయితే దీన్ని పవన్ బాగా కాపీ చేశారు. తిరుపతి సభలో ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యం అంటూ బీరాలు పలికారు. ఇక్కడ పవన్ బహుశా ఓ ఫార్ములాను ఫాలో అయిఉండవచ్చు. కొత్తగా విజయానికి దారులు వెతికేకన్నా కూడా విజయానికి దగ్గరలో ఉన్న జగన్ ను కాపీ కొడితే సరిపోతుంది అని పవన్ భావించి ఉండవచ్చు. అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతున్నారు.

ఇక జగన్ యువభేరీల పేరుతో ప్రత్యేక హోదా మీద యువతలో అవగాహన కల్పిస్తుంటే అదే విధంగా పవన్ కూడా ప్రతి జిల్లా తిరిగి ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పిస్తానని ప్రకటించారు. ఇలా ప్రత్యేక హోదా మీద జగన్ ప్రచారం చేస్తుంటే… దాన్ని తాను కూడా ఎత్తుకొని కేవలం ప్రత్యేక హోదా ఇస్తే చాలు అన్నట్లు నాలుగు పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. ఇక ఆ మధ్యన పవన్ మెగాఆక్వాఫుడ్ పార్క్ బాధితులతో  మాట్లాడటం కూడా కాపీ అని తెలుస్తోంది. జగన్ మెగాఆక్వాఫుడ్ పార్క్ బాధితులతో మాట్లాడేందుకు వెళుతున్నారు అనే పక్కా సమాచారం అందుకున్న తరువాతే పవన్ మీడియా ముందు బాధితులను పలకరించారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక జగన్ ఎలా అయితే అడుగులు వేస్తున్నాడో పవన్ కూడా అదే అడుగులు వేస్తున్నాడు. జగన్ కర్నూలు జిల్లాలో యువభేరి నిర్వహిస్తే అదే రాయలసీమ జిల్లా అయిన అనంతపురంలో సభను నిర్వహించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇలా పవన్ జగన్ ను అన్ని రకాలుగా ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని గమనించాలి. జగన్ యువతలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల పలానా లాభాలు అంటూ వివరిస్తున్నారు. వారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. కానీ పవన్ మాత్రం అలా చెయ్యడం లేదు. సభా వేదికపై ఒక్కడే ఉండి.. తాను చెప్పాల్సింది చెప్పి తుర్రుమంటున్నారు. కానీ అసలు సత్యం ఏమిటంటే.. ప్రజలు నాలుగు రోజులు వచ్చి.. నాలుగు పంచ్ డైలాగులు చెప్పే వారిని నమ్మే రోజులు కావివి.

Related posts:
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
పవన్ మాస్టర్ స్కెచ్
పవన్ చంద్రుడి చక్రమే
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
తొక్కితే తాటతీస్తారు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పిట్టల దొరను మించిన మాటల దొర
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments