స్థూపం కావాలి

Pawan Kalyan demands for Jai Andhra Movement Martyrs memorial in Andhra Pradesh

Pawan Kalyan demands for Jai Andhra Movement Martyrs memorial in Andhra Pradesh. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఏపిలో రాజకీయ దుమారానికి కారణమైన పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని ఎండగట్టిన పవన్ బిజెపి నాయకుల మీద విమర్శలకు దిగారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మీద అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రా ఉద్యమంలో నాడు వెంకయ్య నాయుడు ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, తన పిన్ని గారి అబ్బాయికి సంబందించిన ఓ బాధాకర ఘటనను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ కు పిన్ని వరుస ఉన్న ఓ తల్లి తన కొడుకును ఆంధ్రా ఉద్యమం టైంలో పొగొట్టుకుందట. ఏం జరిగింది అని అడిగితే ‘తన బిడ్డను వెంకయ్య నాయుడు పొట్టనపెట్టుకున్నాడు’ అని తన గోడును వెల్లబుచ్చింది అని పవన్ అన్నారు.  నాడు వెంకయ్య నాయుడు చేసిన రెచ్చగొట్టే మాటల కారణంగా ఇలా జై ఆంధ్రా ఉద్యమంలో యువకులు అమరులయ్యారు. ఆ తల్లి ఇప్పటికీ బాధపడుతోందని ఆయన కాకినాడ వేదికగా అన్నారు.  అలాగే తెలంగాణలో అమరవీరులకు తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేశారని కానీ ఆంధ్రాలో మాత్రం స్థూపం లేదని, వారిని మరిచిపోయారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏడు వందల మంది చనిపోతే అక్కడి సర్కార్ వారిని గుర్తించిందని కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది జరగలేదని అన్నారు. దీనికి వెంకయ్య నాయుడు బాధ్యతవహించి కనీసం వారికి అమరవీరుల స్థూపాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటుచెయ్యాలని సూచించారు.

సీమాంధ్ర ప్రజలు ఎంతో మంది సమైక్య రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారని.. కానీ అలాంటి వాళ్ల స్మారక స్థూపం కూడా లేకపోవడం విచారించాల్సిన విషయం అని పవన్ అన్నారు. ఇది వాస్తవమే. తెలంగాణ సర్కార్ చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం చేసింది. అమరవీరుల త్యాగాలకు స్మరించుకుంటూ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి స్థూపం లేదు. అమరవీరులైన వారికి కనీసం ఎక్కడ గుర్తింపుకూడా లేదు. దాదాపుగా నాలుగు వందల మంది సీమాంధ్రకు చెందిన వారు ఉద్యమంలో చనిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ నాలుగు వందల మంది పేర్లను తెలుసుకోవాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.  కాగా అంతకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వెంకటరాములు కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చెయ్యకపోయినా.. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఐదు లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఇది ఎంతో ప్రశంసనీయం.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
సన్మానం చేయించుకున్న వెంకయ్య
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
బాబు బండారం బయటపడింది
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
బతుకు బస్టాండ్ అంటే ఇదే
నారా వారి నరకాసుర పాలన
అమెరికా ఏమంటోంది?
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?

Comments

comments