అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా

Pawan Kalyan Entry on that time

In Kakinada Meeting Janasena Founder Pawan Kalyan gave clarity on his entry. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో సభను కాకినాడ వేదికగా నిర్వహించారు. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై గర్జించారు. ఏపికి కేంద్రం కేటాయిస్తానన్న ప్రత్యేక హోదాపై ప్రకటన చెయ్యకుండా కేవలం ప్రత్యేక ప్యాకేజీ మీద ప్రకటన చేసింది. పవన్ కేంద్రంపై అల్టిమేటం జారీ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏపికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైతే అప్పుడు తాను వస్తానని పవన్ తన ఎంట్రీని డిక్లేర్ చేశారు. ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు, ప్రతిపక్ష, మిత్రపక్షాలు ఏమీచెయ్యలేని సందర్భంలో తాను రంగంలోకి దిగుతానని పవన్ స్పష్టం చేశారు.

పవన్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఎప్పుడు అని వచ్చిన ప్రశ్నలకు సమాధానమిస్తూ చివరకు అన్ని పక్షాలు తమ వల్ల కాదు అని చేతులెత్తేస్తే అప్పుడు తాను రంగంలోకి దిగి తన సత్తాను చాటుతానని పవన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కాంగ్రెస్ వాళ్లు మోసం చేశారని, ఇప్పుడు బిజెపి వాళ్లు కూడా అదే మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. టిడిపికి తాను కొమ్ము కాశానని, తన అన్నయ్య, వదిన, అక్కాచెల్లెళ్లను కాదని తెలుగుదేశానికి మద్దతు పలికితే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కనీసం మాట్లాడటం లేదని అన్నారు.

2019 ఎన్నికల టైం నాటికి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు అనుకున్న వారికి ఓ క్లారిటీ మాత్రం ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడతానని బీరాలు పలికిన పవన్ తిరుపతిలో మాట్లాడిన మాటలను కాకినాడ వచ్చేసరికి మరిచిపోయారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాటానికి సిద్దంకావాలని, ఒకవేళ తమ వల్ల కాదు మేం ఏమీచెయ్యలేము అని చేతులెత్తేస్తే అప్పుడు తాను రంగంలోకి దిగి ఏం చెయ్యాలో అదే చేస్తానని పవన్ అన్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా కోసం తాను ముందుగా అయితే దిగనని, అందరూ పోరాడి సాధించలేక అలిసిపోతే అప్పుడు రంగంలోకి దిగుతానని మాత్రం స్పష్టం చేశారు.

Related posts:
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వాళ్లను వదిలేదిలేదు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
ఆ సిఎంను చూడు బాబు...
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బెంగళూరుకు భంగపాటే
అకౌంట్లో పదివేలు వస్తాయా?
మోదీ చేసిందంతా తూచ్..
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Comments

comments