ఉక్కిరిబిక్కిరి

Pawan Kalyan freeze AP Parties with his meeting

సీమాంధ్రలో రాజకీయాలు ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి సభతో ఒక్కసారిగా ప్రత్యేక హోదాపై గళమెత్తారు. దాంతో నిన్న మొన్నటిదాకా ప్రత్యేక హొదాపై కాలం వెల్లదీస్తున్న  సీమాంధ్ర నాయకులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్క సింగిల్ పాయింట్ అజెండాతో దిమ్మతిరిగే రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు. దాంతో నిన్నటి దాకా కేవలం తెలుగుదేశం పార్టీకి వైసీపీ పోటీ ఇస్తుందని.. దాదాపుగా ఓటుశాతంలో వచ్చే చిన్న వ్యత్యాసమే 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేరువ చేస్తుంది అని అందరూ ఊహించారు.

కానీ ఏపి పాలిటిక్స్ తెరపైకి సర్టెన్ రైజర్ గా వచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన అభిమాని మృతితో కలత చెందిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తిరుపతి వేదికగా సభకు పూనుకోవడం అందరికి షాకిచ్చింది. పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తారని.. మోదీని టార్గెట్ చేస్తారని.. ఇలా రకాలుగా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం అందరిని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంది  అంటూనే ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారని.. సిబిఐ అంటే భయపడుతున్నారా..? ఏం లొసుగులు ఉన్నాయా..? అని నిలదీశారు. దీంతో చంద్రబాబును పవన్ ఓ రకంగా ఏకిపారేశారు.

ఇక జగన్ విషయానికి వస్తే అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా కానీ ఖచ్చితంగా సీమాంధ్రుల మనోభావాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను ముందుండి పోరాడతాను అని పిలుపునివ్వడం ద్వారా నిన్నటి దాకా తమ హక్కు అన్నట్లు వ్యవహరించిన వైసీపీ, ముఖ్యంగా జగన్ కు నోట్లో వెళక్కాయపడ్డట్లైంది. మరి ఇలా జగన్ ఎంట్రీతో ఇటు చంద్రబాబు నాయుడు, అటు ప్రతిపక్ష నాయకుడు జగన్ కు చెక్ పెట్టారు. ఫలితంగా ఏపి అధికార, ప్రతిపక్ష పార్టీలను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జనసేన అధినేత.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
ఆ అద్భుతానికి పాతికేళ్లు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments