ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్

Power-Punch

తిరుపతిలో ఈ రోజు సభ పెట్టడానికి మూడు కారణాలున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒకటి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో నేనేం ఎదుర్కొన్నాను. రెండు తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది… దాని మీద అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఇక్కడికొచ్చానన్నారు. ఇక మూడో విషయానికొస్తే ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పటిదాకా ఇవ్వకుండా ఆలస్యం చేసిన ప్రభుత్వం మీద.. నేను కొన్ని అడగాల్సినవి ఉన్నాయ్.. తేల్చుకోవాల్సినవి ఉన్నాయ్.. అందుకే ఈ సభాముఖంగా మాట్లాడటానికి మీ ముందుకొచ్చానన్నారు. ఆ రోజున చంద్రబాబు, మోదీ, నేను తిరుపతిలోనే తొలి సభ నిర్వహించాం…అందుకే ఇక్కడి నుంచే మాట్లాడాలని నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు.

తిరుపతి బహిరంగ సభలో పవన్ మాటల్లో ముఖ్యాంశాలు:
– జనసేన ప్రశ్నించడం లేదని విమర్శిస్తున్నారు.. తాము ఏం చేయాలన్నా.. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.. ప్రశ్నించే సమయం ఆసన్నమైంది కాబట్టి హోదాపై ఈ రోజు ప్రశ్నిస్తున్నా
– ప్రత్యేక హోదా పై చర్చ ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం. నేను ప్రత్యేక హోదా కోసం మూడు స్టేజీలలో పోరాటం చేస్తాను.
మొదటి స్టేజి: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి పత్యేక హోదా అంటే ఏమిటి..? దాని వల్ల కలిగే లాభాలేంటి అన్నదానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాను. దీనిపై ప్రభుత్వాల పనితీరు పై ప్రజల అభిప్రాయం కనుక్కుంటాను.
రెండవ స్టేజి: రాష్ట్ర, మరియు కేంద్ర ఎంపీల వద్దకు వెళ్లి వారిపై ఒత్తిడి తెస్తాను. అప్పటికీ ప్రయోజనం లేకుంటే
మూడవ స్టేజీ: నా అభిమానుల అండదండలతో, జనసేన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తాను.
– మాట్లాడేందుకు సరైన సమయం సందర్భం చూస్తాను తప్ప మాట్లాడే ధైర్యం లేక కాదు.
– సెప్టెంబర్ 9న కాకినాడ లో జనసేన పార్టీ కి సంబంధించి పెద్ద ప్రజా సభ ఉంటుంది.
– ప్రత్యేక హోదా పోరాటంలో నా మెడ తెగి ముందుకి పడాలి తప్ప, అడుగు మాత్రం వెనక్కి పడదు.
– తనకు కులమతాలు అంటగడితే కోపం నషాళానికి అంటుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో తన దృష్టికి వచ్చిన లోపాలను ఎత్తిచూపినప్పుడు తనకు కులాన్ని ఆపాదించేందుకు కొందరు ప్రయత్నించారు.

Also Read:    ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
– నా అభిమానులే నా ధైర్యం. మీరు లేకుంటే నేనొక్కడ్ని ఏమీ చేయలేను.
– వెంకయ్యనాయుడు వయసులోనే కాకుండా రాజకీయాల్లో చాలా పెద్దవారని అన్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, వయసు తనకు లేవని అంటూ ‘సర్ మీరు అలా మాట్లాడకండి’ అని కోరారు. ప్రజలంతా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారని, ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారని గుర్తుచేశారు.

Also Read:    టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
– కేంద్రంలో ఉండేది కూడా మనుషులే కదా.. సీబీఐ మీపైన ప్రయోగిస్తుందని భయమా.. మీకు లొసుగులు ఏమైనా ఉన్నాయా.. మాట్లాడండి.. నిలదీయండి.. పార్లమెంటును స్తంభింపజేయండి.
– బీజేపీతో జతకట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. ఎన్నికల రాజకీయాలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలన్న ఆశలేదనీ, కలిసి పోటీ చేసే ప్రస్తక్తే లేదని ప్రకటించారు
–  ఢిల్లీలో సోనియాను కలిసినప్పుడల్లా మేడమ్.. మేడమ్.. మేడమ్ అనడం తప్ప మరేం అనలేకపోయారని అన్నారు. చేతుల కట్టుకుని వొంగివొంగి దండాలు పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీలకు సిగ్గు, లజ్జ ఏమాత్రం లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు.
– మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని పదేపదే చెబుతున్నారని, కానీ ఆరు కోట్ల మంది ప్రజలు అడ్డుకున్నా విభజన ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
– మన ఎంపీలకు హిందీ రాదు.. వాళ్లకు తెలుగు రాదు. అందుకే మనోళ్లంతా హిందీ నేర్చుకోవాలి.. మోదీజీ, సోనియాజీ హమ్ కో స్పెషల్ స్టేటస్ చాహీయే అని అడగండి.
– కేశినేని నాని, మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, మంత్రి నారాయణ.. తదితరులను చూసి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు అనుకోకండి. ఆరు కోట్ల ప్రజలను చూసి ఇవ్వండి.
– పోరాడదాం.. సాధించే వరకూ పోరాడదాం.. గెలిచే వరకూ పోరాడదాం.. మనకు ప్రత్యేక హోదా వచ్చే వరకూ. మన హక్కులు సాధించే వరకూ పోరాడదాం..
– పవన్ కల్యాణ్ మీకంటే గొప్పోడా.. మీరంతా కలిస్తేనే కదా పవన్ కల్యాణ్.. నేను 72 కిలోలు.. కొడితే పడిపోతా.. మీరు నా బలం.. మన జాతి ఆడపడుచులు నా బలం.. మీ బలం చూసి కేంద్రంతో పోరాటం చేయగలను కానీ.. ఒక్కడినే చేయలేను.
– కేంద్రానికి ఓ మాట చెప్పదలుచుకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ లూ.. మేము చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. స్పెషల్ స్టేటస్ ఇచ్చే వరకూ పోరాడతాం.. లడాయేంగే.. లడాయేంగే.. జీతే తక్ లడాయేంగే.. ఇదే మన నినాదం.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
కాటేసిందని పాముకు శిక్ష
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ ప్రాణానికి ముప్పు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
బీసీసీఐకి సుప్రీం షాక్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments