పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!

Pawan Kalyan hijack Jagan party slogan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి రాజకీయాల్లో తీవ్ర అలజడిని సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపిలో పవన్ ఒక్కసారిగా జనసేన ప్రత్యేక పంచ్ వేసి.. ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిచారు. తెలుగు రాష్ట్రాలను రెండు రాష్ట్రాలుగా విభజించే టైం నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా సీమాంధ్రుల మనోభావాలను పట్టించుకోలేదు. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదా పల్లవి ఎత్తుకున్నారు నాటి కేంద్రంలోని నాయకులు. కానీ ఇప్పుడు అదే ప్రత్యేక హోదా పల్లవితో ఏపి రాజకీయాలను పవన్ కళ్యాణ్ హైజాక్ చేసినట్లు అనిపిస్తోంది.

నిన్నటి దాకా ప్రత్యేక హోదాపై కేవలం ఏపి ప్రతిపక్షపార్టీ వైసీపీ మాత్రమే మాట్లాడేది. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ నాయకులు మాట్లాడటం.. దానిపై రాష్ట్రంలో అధికార పార్టీని తిట్టినతిట్టుతిట్టనట్లు తిట్టారు. నిన్నామొన్నటి దాకా ప్రత్యేక హోదా అనేది అధికారపక్షానికి గుదిబండగా, ప్రతిపక్షపార్టీ వైసీపీకి ఆయుధంగా ఉండేది. కానీ ఒకే ఒక్క మీటింగ్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాను హైజాక్ చేశారు. జనసేన అధినేత మూడు దశల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ప్లాన్ వేశారు. దీని వల్ల రాబోయే ఎన్నికల నాటికి జనసేన పార్టీకి పునాదులు వెయ్యడంతో పాటుగా వేరే ఏ పార్టీ కూడా ప్రత్యేక హోదాపై పోరాడలేని పరిస్థితులను ఆయన సిద్ధం చేస్తున్నారు.  సీమాంధ్రుల్లో ఎక్కడో వైసీపీ అయినా కనీసం ప్రత్యేక హోదాపై మాట్లాడుతోంది అనే సానుభూతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ ను జనసేన ప్యాకేజ్ కింద కొట్టేస్తున్నట్లు అనిపిస్తోంది.

తిరుపతి సభలో తన రాజకీయ పార్టీ భవిష్యత్తుకు సంబందించిన ఏదో కీలక ప్రకటన చేస్తారు అనుకుంటే అవేవీ లేకుండా కేవలం సింగిల్ పాయింట్ అజెండాగా ప్రతి సీమాంధ్రుడి మదిలోని ప్రత్యేక హోదా కాంక్షను పవన్ క్యాచ్ చేశారు. ఇప్పుడు అందుకే ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తానంటూ గర్జించాడు. ఏపిలో అధికార, ప్రతిపక్షపార్టీలతో పాటు దిల్లీలో అధికారంలో ఉన్న పార్టీలకు, తెలుగు రాష్ట్రాలను అవస్థలపాలుచేసిన పార్టీలకు కూడా ప్రత్యేక హోదాపై పవన్ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.

ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం అవసరం.. అది మా హక్కు అన్న పవన్. ఒక్కసారిగా సీమాంధ్రుల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఇది ఓ రకంగా సీమాంధ్రులకు ప్రస్తుతానికి కాకపోయినా భవిష్యత్తులో అయినా మంచి చేసే అంశమే. కానీ ఇదే అంశం ఏపి ప్రతిపక్షపార్టీ వైసీపీకి మాత్రం ఏమాత్రం రుచించని అంశం. ప్రత్యేక హోదా కోసం మేం పోరాటం చేస్తున్నాం అని చెప్పిన జగన్ కు పవన్ తన తిరుపతి  సభ సాక్షిగా పెద్ద షాకిచ్చారు. నిన్నటి దాకా ప్రత్యేక హోదా కాంక్ష కలిగిన వారందరికి తన జనసేనతో ఓ వేదికను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ పార్ ఒక్కటే ప్రత్యేక హోదాపై పోరాడగలదు అన్న భావనను జనసేన ఇప్పుడు లాగేసుకుంది. మరి ప్రత్యేక హోదాపై వైసీపీ నిన్నటి దాకా తీసుకున్న స్టాండ్ ను పవన్ తిరుపతి సభతో హైజాక్ చెయ్యడంతో భవిష్యత్తులో జగన్ ఎలాంటి వ్యూహరచన చేస్తారు అన్నది వైసీపీ పార్టీకి చాలా ముఖ్యంగా మారనుంది.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
అన్నదమ్ముల సవాల్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments