ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన

Pawan Kalyan history between two extinguished lives

Pawan Kalyan history between two extinguished lives. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఏపిలో రాజకీయం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ మధ్య జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని రీతిలో రీఎంట్రీ ఇచ్చారు. జనసేనలో పవన్ ఒక్కరే స్టేజీమీద కనబడినప్పటికీ జనసేన అనేది టిడిపికి ఒక ఎక్స్‌టెన్షన్ లాగా రాజకీయ విశ్లేషకులలో భావన తీసుకొచ్చారు.

తన రీఎంట్రీలో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానని చెబుతూ అప్పటి వరకు ఎవరు ఇవ్వని మూడంచెల పోరాట ప్రణాళికను ప్రకటించారు. పోరాటం మూడు దశలలో చేస్తానని ప్రతి ఒక దశలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ప్రజలకు నమ్మబలికారు.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీకి కారణం ఒక రకంగా వినోద్ అనే అభిమాని చనిపోవడం. అప్పటి వరకు పవన్ పై ప్రజలు, ఫ్యాన్స్ విసిగిపోయారు. ఎందుకంటే ప్రశ్నించడానికే పార్టీ అని పెట్టి అవసరమైనప్పుడు ప్రశ్నించకపోగా ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యక పవన్ కళ్యాణ్ నాన్చుడు ధోరణికి ఫ్యాన్స్ మనస్తాపం చెందడం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా వినోద్ మరణంతో తన సినిమా ప్రపంచం నుండి రాజకీయ ప్రపంచంలోకి ఒక్కసారిగా దూకారు. అంతేకాకుండా కొత్త ఆశలు ఫ్యాన్స్ లో రేకెత్తించారు. ఇంకేముంది జనసేన మళ్లి పున:ప్రారంభం అనుకున్నారంతా. . జెండా, అజెండాతో ముందుకు వెళ్లచ్చు అనుకున్నారు.

కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ప్రత్యేక హోదా అనే సింగిల్ పాయింట్ అజెండాతో పవన్ రంగంలోకి దిగి తన ఆవేదనను వ్యక్తపరిచారు. అంతకంటే ఎక్కువ ఆవేదనని ఆత్మగౌరవం పేరుతో కాకినాడలో జరిగిన సభ ద్వారా వ్యక్తం చేశారు. ప్రత్యేక పోరాటాన్ని ముందుకు తీసుకొనివెళ్లకపోగా తన పని కేవలం రాజకీయ నేతలపై ఒత్తిడి తీసుకురావడమే అని వారు చేయలేని పక్షంలో  అప్పుడు తన సత్తా చూపిస్తానని మరోసారి నమ్మబలికారు. దురదృష్టవశాత్తు ఆ బహిరంగ సభ అనంతరం తోపులాటలో ఓ వ్యక్తి మరణించారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ప్రస్థానం రెండు ఆరిన దీపాల మధ్య ముగిసిపోయింది.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
ఇదే జగ‘నిజం’
పవన్ చంద్రుడి చక్రమే
అన్నదమ్ముల సవాల్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments