ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం

Mudragada-pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించినా కానీ తొందరపడకుండా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకుగాను ఏ ఒక్క తప్పుటడుగుకు అవకాశమివ్వడం లేదు. నిజానికి పార్టీకి వ్యవస్థాగత నిర్మాణం లేదు.. ముందు చూపు ఉన్న మేనిఫెస్టోలేదు. అయినా కానీ ఉన్నది ఒక్కటే అదే పవన్ చరిష్మా. పవన్ చరిష్మాతో ముందుకు సాగుతున్న తరుణంలో చాలా మంది అడిగిన ఓ ప్రశ్న. కాపు ఉద్యమం టైంలో ఎందుకు ముద్రగడకు అనుకూలంగా మాట్లాడలేదు అని. దానికి సబందించిన వివరణ ఇదే..

ముద్రగడ పద్మనాభం ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అది కూడా ఏపిలో ఎంతో గట్టి ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే ఓటు బ్యాంకు మాత్రమే ఆలోచించి పవన్ ముద్రగడకు అనుకూలంగా ప్రకటన చెయ్యకుండా ఉన్నారు అని కాదు. కానీ పవన్ తీసుకున్న ప్రతి స్టెప్ ను గమనిస్తే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారో అర్థమవుతుంది. ముద్రగడ చేసిన పోరాటం కేవలం ఓ వర్గానికి మేలు చేసేది మాత్రమే. ఆ వర్గానికి చెందినంత మాత్రాన పవన్ వారికి అనుకూలంగా మాట్లాడాలి అని కాదు. అలా ఓ వర్గానికి అనుకూలంగా మాట్లాడితే మాత్రం అందరి నాయకుడు ఎన్నటికీ కాలేడు. దీన్ని పవన్ బాగా గుర్తించారు.

దీన్ని మరోలా వివరించే ప్రయత్నం చేస్తాం. మందకృష్ణ మాదిగను చూడండి. ఆయన కేవలం ఓ సామాజిక వర్గానికి మాత్రమే వంత పాడుకుంటూ వస్తున్నారు. ఆయన పార్టీ పెట్టినా.. లేదంటే వేరే పార్టీతో పొత్తుపెట్టుకున్నా కానీ ఆయనను ఆ సామాజిక వర్గం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. అలా మందకృష్ణ మాదిగలా పవన్ కళ్యాణ్ మారకుండా చాలా చాకచక్యంగా అడుగులు వేశారు. అందుకే ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా పవన్ చేసిన వ్యాఖ్యలు ఏ వర్గానికి కోపాన్ని కానీ సానుభూతిని కానీ పెంచకుండా చేశాయి.

పవన్ కళ్యాణ్ తుని ఘటన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన రిజర్వేషన్ల గురించి చాలా బ్రాడ్ మైండ్ తో ఉన్నారు. రిజర్వేషన్లు అనేది ఇప్పటికిప్పుడు తేలేవి కాదు అని ఆయన అన్నారు. రిజర్వేషన్లను ఓ వర్గానికి కేటాయించడం ద్వారా మరో వర్గానికి అన్యాయం జరిగే అవకాశాలున్నాయి. ముద్రగడ చేసిన ఉద్యమం ఓ రకంగా అలాంటి ప్రభావాన్ని చూపించేదే. అందుకే పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గానికి నష్టం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది, అనేక కులాల, మతాల వారు పవన్ కు అభిమానులగా ఉన్నారు. వారి అందరి అభిమానాన్ని పొందారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అందరికి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ముద్రగడ నాడు తన మీటింగ్ కు ఆహ్వానం పంపినా, చివరకు తన అన్న చిరంజీవి స్వయంగా ముద్రగడకు అనుకూలంగా ప్రకటన చేసినా కానీ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. మొత్తంగా పవన్ తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా స్ట్రాటజిక్ గా ఉంది అన్నది మాత్రం వాస్తవం.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
ఆ అద్భుతానికి పాతికేళ్లు
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
జీఎస్టీ బిల్ కథ..
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
చంద్రుడి మాయ Diversion Master
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
మెరుపు దాడి... నిజమా-కాదా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments