పవన్ మాస్టర్ స్కెచ్

Pawan-Master-sketch

తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న పవర్ స్టార్ 2014లో జనసేనతో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. జనసేన పేరుతో ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం మినహా ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీకి పవన్ పూనుకోలేదు. అయితే 2014 నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ పవన్ ఒకటి అర తప్పితే మిగతా ఏ సందర్భాల్లోనూ ప్రజలతో మమేకం కాలేదు. ప్రత్యేకంగా రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ 2019 ఎన్నికల ముందు ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో సభ నిర్వహించడం.. అందులో ఎవరూ ఊహించని విధంగా ప్రత్యేక హోదా ఒక్కటే తన అజెండాగా ప్రకటించడం అధికార, ప్రతిపక్ష, విపక్షాలకు కూడా షాకిచ్చింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏ పార్టీని టార్గెట్ గా చెయ్యకుండా కేవలం నాడు కేంద్రం ఏపికి కేటాయిస్తామన్న ప్రత్యేక హోదానే ఆయన అజెండాగా ఎత్తుకోవడంతో రాజకీయ కోణం పూర్తిగా మారింది.

అదే తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మోదీని లేదంటే చంద్రబాబు నాయుడునో చేతగాని వారిగా, వైసీపీని కూడా టార్గెట్ గా చేసి ఉంటే అది పార్టీ పరంగా ఉండేది. కానీ అలా కాకుండా ప్రతి సీమాంధ్రుడి గుండెచప్పుడుగా భావిస్తున్న ప్రత్యేక హోదాను పార్టీలకు సంబందం లేకుండా పోరాడి.. సాధించుకుందాం అని పిలుపునివ్వడం వెనక చాలా రాజకీయం ఉంది. తిరుపతి సభ వేదికగా జనసేన పార్టీ అజెండా ఇది.. మా సిద్ధాంతాలు ఇవి అని ఉంటే అది కేవలం జనసేన వరకు మాత్రమే, పవన్ అభిమానుల వరకు మాత్రమే పరిమితమయ్యేది.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓ పార్టీ అధినేతగా అన్ని జిల్లాల్లో తిరగలేరు. ఉదాహరణకు కర్నూల్, అనంతపురం లాంటి జిల్లాల్లో పవన్ యాత్ర అంత ఈజీగా ఉండదు. అందుకే అదే ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎత్తుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి రావడం కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది.  అలాగే తెలుగుదేశం లేదా వైసీపీ పార్టీ ప్రాభల్యం గట్టిగా ఉన్న ఏరియాల్లో పవన్ సక్సెస్ కావాలంటే ప్రత్యేక హోదా లాంటి సెన్సిటివ్ అంశం కావాలి.ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం ఆ స్కెచ్ లో భాగమే.

కానీ అలాకాకుండా ఏ పార్టీలో ఉన్నా.. ఏ పార్టీ ఇచ్చినా ప్రత్యేక హోదానే తమ పరమావధిగా భావించే వాళ్లు అన్ని పార్టీల్లో.. అన్ని వర్గాల్లో ఉన్నారు. పవన్ కరెక్ట్ గా ఇక్కడే టార్గెట్ గా చేశారు. పార్టీపరంగా కాకుండా జనాల్లో ఉన్న సెంటిమెంట్ ను ఆయన మేల్కొల్పోలే చేసి.. దాని వల్ల లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కేవలం ప్రజల అజెండా ప్రత్యేక హోదా అని చెప్పిన పవన్ ముందు ప్రజల్లోకి దూసుకెళ్లడం ద్వారా రాకెట్ స్పీడుతో జనసేనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలుగుతారు.

ఇలా కర్రవిరగకుండా.. పాము చావకుండా ప్రత్యేక హోదా అనే అంశంతో ప్రతి ఒక్క సీమాంధ్రుడిని తడుతున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటు చేస్తే కేంద్రానికి వ్యతిరేకంగా సీమాంధ్రులు ఏరకంగా అయితే పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రం కోసం పోరాడారో ఇప్పుడు అదే స్పూర్తిని ప్రజల్లోకి తెస్తూ తన జనసేనను మెల్లిగా వారికి చేరువ చేయాలన్నదే పవన్ కళ్యాణ్ వేసిన పవర్ మాస్టర్ ఫుల్ స్కెచ్. పొలిటికల్ గా లేట్ గా స్పందించినా కూడా పవన్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కరెక్ట్ అయ్యారు. మొత్తంగా పవన్ వేసిన స్కెచ్ మాత్రం రాజకీయ మేధావులకు కూడా చెమటలు పట్టిస్తోంది. మరి సమీప భవిష్యత్తులో కాకున్నా కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం దీని ప్రభావం చాలా గట్టిగా కనిపించే అవకాశాలున్నాయి.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఆ అరుపులేంటి..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
తొక్కితే తాటతీస్తారు
చెత్త టీంతో చంద్రబాబు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
పవన్ క్షమాపణలు చెప్పాలి
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments