పవన్ ను కదిలించిన వినోద్

Pawan Kalyan moves after His Fan Vinod Royal Death

ప్రశ్నిస్తానన్న గొంతుక ప్రెస్ మీట్‌లకే పరిమితమైంది. నిలదీస్తానన్న నాలుక ఆచితూచి మాట్లాడింది. సవాలక్ష సమస్యలున్నా స్వరం మాత్రం మూగబోయింది. పార్టీ స్థాపించి రెండున్నరేళ్లు దాటినా కార్యాచరణ కానరాలేదు. ఇన్నాళ్లకు ప్రస్థానం ప్రారంభించే సమయమొచ్చింది. జనంలోకి జనసేనాని వస్తున్నాడు. ప్రస్థానం ప్రారంభించిన తిరుపతి గడ్డపైనే మరో ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. ఇంతకీ జనసేనాని ఇప్పుడు చాలా కాలానికి ప్రజల్లోకి రావడానికి ఓ వ్యక్తి కారణమయ్యాడు. అతడే వినోద్ రాయల్.

వినోద్ రాయల్. తిరుపతి ఎస్టీవీ నగర్ లో ఉంటాడు. పవన్ అంటే పిచ్చి అభిమానం. పవన్ అభిమాన సంఘం పేరుతో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. జనసేనలో కూడా చురుగ్గా ఉండేవాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా పొలిటికల్ గా మార్పులు తీసుకువచ్చి.. కొత్త చరిత్రకు నాంది పలుకుతారు అని అనుకున్నాడు. కానీ అంతలోనే అనుకోని దుర్ఘటనలో వినోద్ రాయల్ చనిపోయాడు. దాంతో తన అభిమాని హత్య అంశం పవన్ కళ్యాణ్ ను కదిలించింది. పరామర్శకు వెళ్లిన పవన్ అనూహ్యంగా తిరుపతిలో సభకు పూనుకున్నారు.

తన అభిమాని హత్య(చావు)తో ప్రభావితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవేశంగా అయినా ఆలోచనాపరంగా అయినా ఏం మాట్లాడతారు అనేది అందరికి ఆసక్తిని రేపుతోంది. రెండున్నరేళ్ల క్రితం పార్టీ ప్రారంభించిన తిరుపతి గడ్డపైనే ప్రస్థానం సభకు పవన్ శ్రీకారం చుట్టాడు. అసలు ప్రస్థానం సభలో పవన్ ఏం మాట్లాడుతారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆ మధ్య ప్రత్యేక హోదాపై పెద్ద రచ్చే జరిగినా పవన్ నుంచి పెద్దగా స్పందన లేదు. నా వల్లే హోదా వస్తుందనుకోను! ఎంపీలు ఎమ్మెల్యేల వల్లే కానిది నా వల్ల అవుతుందా!! అన్న పవన్ వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. కానీ తన అభిమాని చావు మాత్రం పవన్ లో కదలిక తీసుకువచ్చింది.

తిరుపతి సభలో ప్రత్యేక హోదా టార్గెట్ గా పవన్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడన్న వాదనలూ వినిపిస్తున్నాయ్. హామీల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తారన్న చర్చ నడుస్తోంది. దీంతో పాటు స్విస్ ఛాలెంజ్, కాపు రిజర్వేషన్లు ఇలా మాట్లాడేందుకు సమస్యలు, వివాదాలు చాలానే ఉన్నాయ్. ఇక అన్నింటికి మించిన ట్విస్ట్ ఏంటంటే.. ఏపికి ప్రత్యేక హోదా కోసం పవన్ నిరాహార దీక్షకు దిగుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి అదే గనక జరిగితే ఏపితో పాటు దిల్లీలో కూడా పవన్ ప్రకంపనలు కలగడం ఖాయం.

మరోపక్క పవన్ జనసేన ప్రస్థానం సభకు ఇందిరా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, సభ నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన విధంగా తమ వద్ద తగినన్ని పోలీసు బలగాలు లేవని ఎస్పీ తేల్చి చెప్పారు. తమ పార్టీ సొంత వాలంటీర్ల సహాయంతో శాంతి భద్రతలకి ఆటంకం కలగకుండా సభ నిర్వహిస్తానని చెప్పడంతో సభ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందిరా మైదానం వేదికగా అటు ఇటుగా 8వేల మంది కంటే ఎక్కువ పట్టే అవకాశం లేదు. దీంతో సభకు వచ్చేందుకు కేవలం తిరుపతి వాసులకే అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
చంద్రుడి మాయ Diversion Master
వెనకడుగు
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఇక యుద్ధమే కానీ..
తొక్కితే తాటతీస్తారు
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments