పవన్ క్షమాపణలు చెప్పాలి

Pawan Kalyan must apologize

నాయకుడు అనేవాడు నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అంతేకానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం సరిపోదు. ప్రజాజీవితంలోకి వచ్చాక ఒక్కసారి మాట తూలితే అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చేశాడు. ఆయన పార్టీ స్థాపించిన తర్వాత జనాల్లోకి వెళ్లి, వారి సమస్యల మీద పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మొన్నీమధ్యన అనంతపురం జిల్లాలో సభను ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజంగా ఆమోదయోగ్యం కాదు.

ఇప్పుడిప్పుడే పొలిటికల్ అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చే ప్రతి మాటను కొన్ని కోట్ల మంది వింటారు. ఆయన మాటలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి. మరి అలాంటి మాటలు నోరుజారి తప్పు మాట్లాడితే అది ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపించడం లాంటిదే. అనంతపురం జిల్లాకు వచ్చిన ప్రతి నాయకుడు కరువు గురించి మాట్లాడటం మామూలే. కరువు అనేది అక్కడికి వచ్చే ప్రతి పొలిటికల్ లీడర్ కు దొరికిన ఎవర్ గ్రీన్ ఇష్యూ. అలాగే పవన్ కూడా దాని మీదే కరువు మాట్లాడారు. కానీ కరువు పరిస్థితి వివరిస్తూ నోరుజారారు.

అనంతపురంలో కరువు దారుణ పరిస్థితికి కారణమవుతుందని, దాంతో ఆడవాళ్లు తమ మానాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు అని పవన్ అనంతపురంలో అన్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కరువుకు అక్కడి ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్లు తమ మానాన్ని అమ్ముకోవడం మార్గంగా ఎంచుకోలేదు. చాలా మంది కరువును ఎదుర్కోవడానికి పట్టణాలకు వలస వెళుతుంటారు. కాగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉండే మహిళలు కరువు వస్తే మానాలు అమ్ముకుంటారా?? అనే అనుమానాలు వచ్చేలా మాట్లాడటం పవన్ కు సరికాదు. అలా చూస్తే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కరువు వస్తుంటుంది, మరి వారు కూడా ఇలానే చేస్తారనే అభిప్రాయాన్ని కూడా ఆపాదించవచ్చు. మరి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఎలా అనుకున్నా కానీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పు. కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పాలి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది. పవన్ చెప్పినట్లు మానాన్ని అమ్ముకునే వాళ్లు చాలా మంది ఉన్నారు.. ఉంటారు కూడా. అయితే వారి పరిస్థితులు వారిని అలా మానం అమ్ముకునేలా చేస్తుంది అంతే తప్పితే కేవలం కరువు వస్తేనే అలా చేస్తారని అనుకోవడానికి లేదు. పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో కరువు కారణంగానే మహిళలు తమ మానాలను అమ్ముకుంటున్నారు అని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు.

ఇక పవన్ వ్యవహారానికి వస్తే కేవలం మీడియా దృష్టిలో రావడానికి మినహా ఆయన చేసిందేమీ లేదు. నాడు అమరావతి భూముల దగ్గరి నుండి మొన్నటి మొన్న ఆక్వాఫుడ్ రైతుల వరకు అన్ని చోట్ల ఆయన కేవలం మాట్లాడటం, తర్వాత ప్రెస్ వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతోంది. నాడు అమరావతి కోసం తమ భూములను లాక్కుంటున్నారని పవన్ కు మొరపెట్టుకుంటే… పెరుగన్నం తిని మిన్నకుండిపోయాడు పవన్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం అమరవీరుల స్థూపం ఏర్పాటు చెయ్యాలని పవన్ డిమాండ్ చేశారు తర్వాత మాత్రం దాన్ని వదిలేశారు. మొన్నీమధ్యన గోదావరి జిల్లా రైతులతో మెగాఆక్వా ఫుల్ బాదితులతో మాట్లాడిన పవన్, కేవలం మీడియా కవరేజ్ కోసం తప్పదేనికీ కొరగాలేదు. ఇప్పుడు మరి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితి వల్ల మహిళలు తమ మానాలను అమ్ముకుంటున్నారు అని అన్నారు. కానీ అలా కాకుండా ఈ పరిస్థితిని మార్చడానికి పవన్ కార్యచరణకు పూనుకోవాలి.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పవన్ మాస్టర్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
టాప్ గేర్ లో ముద్రగడ
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments