ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!

Pawan Kalyan Political Startegy

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఎలా సాగుతోంది అన్న దానిపై అందరికి అనుమానాలే ఉన్నాయి. 2014లో ఎన్నికలకు ముందు జనసేన అనే పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తర్వాత కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. కాగా తర్వాత అప్పుడప్పుడు ట్విట్టర్ లో కూయడం(ట్వీటడం) తప్పితే పవన్ చేసిందేమీ లేదు. ప్రెస్ మీట్ లలో మాత్రం కరెక్ట్ టైంకి అవసరమైన అంశాలపై తాను స్పందిస్తానని అన్నారు. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత తిరుపతి సభతో మరోసారి ప్రజల్లోకి వచ్చారు. తాను సినిమాలే కాకుండా రాజకీయం కూడా చేస్తానని తనదైన శైలిలో చెప్పారు. రాజకీయం అంటే చెడు కాదు మంచి రాజకీయాలు అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో సినిమాలు ఆపి రాజకీయాల్లో ఉంటానని పవన్ అన్నారు. రెండు పడవల్లో ప్రయాణించడం కష్టమన్నారు. కానీ చివరకు మాట తప్పి సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. తాను బ్రతకడానికి సినిమాలు కావాలన్నారు.

తిరుపతి సభలో పవన్ ప్రసంగం ఎంత ఆవేశంగా సాగినా కానీ ఆయన ఆలోచనా విధానాన్ని మాత్రం ప్రశ్నించేలా చేసింది. పవన్ రెండున్నరేళ్ల తర్వాత పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఎలా అడుగులు వేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ కేవలం ప్రత్యేక హోదా అజెండాతో ఆయన ప్రజల ముందుకు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండున్నర సంవత్సరాల పాటు ఆలోచించి ఆలోచించి పవన్ కళ్యాణ్ ఇలాంటి అడుగులు వేశారా.? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాజకీయం
కాగా తిరుపతి వేదికగా ఆయన పలు సభలను నిర్వహించనున్నట్లు పవన్ ప్రకటించారు. కాకినాడలో తొమ్మిదో తేదిన మరోసభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం కాపులకు సంబంధించిన బహిరంగ సభను సెప్టెంబర్ 8నాడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా దాన్ని డైవర్ట్ చెయ్యడానికి చంద్రబాబు నాయుడు పవన్ ద్వారా తొమ్మిదో తేదినాడు బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది. ముద్రగడ ఎనిమిదో తేది సభను ప్రకటించకపోవడం కారణంగా వారు 11వ తేదినాటికి రీషెడ్యూల్ చేసుకున్నారు.

అవగాహన రాహిత్యం
ఏపిలో పరిస్థితులు మారాయి. ఈ తరుణంలో పవన్ పొలిటికల్ ఎంట్రీ ఎవరూ ఊహించని విధంగా అన్ని సమస్యలను తట్టేలా ఉంటుంది అనుకుంటే కేవలం ప్రత్యేక హోదా అనే సింగిల్ పాయింట్ అజెండాతో పవన్ ప్రజల్లోకి వచ్చారు. ప్రత్యేక హోదా అంటూ వచ్చిన పవన్ కు కేంద్రం అనుకోని షాకిస్తోందని అనిపిస్తోంది. కేంద్రం అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చెయ్యాలని ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా ఆ హోదాను తొలగించాలని.. ఆ స్థానంలో ప్రత్యేక రాయితీలు కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇది పవన్ కు చాలా పెద్ద దెబ్బ. ఇక్కడే పవన్ అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. పవన్ ఏదైతే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాడో.. అదే ప్రత్యేక హోదా అనే అంశాన్ని దేశంలో ఎక్కడా లేకుండా చెయ్యాలని అనుకుంటోంది కేంద్రం.  మరి రెండున్నర సంవత్సరాల తర్వాత ఎంతో ఆలోచించి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కు ఇది గడ్డు కాలమే.

మిత్రపక్షాలైన బిజెపి, టిడిపి 2014లో వారి విజయానికి బాసటగా నిలిచిన పవన్ ను ఇంత దారుణంగా ఇరికించారేంటా అనిపిస్తోంది.

Related posts:
అమావాస్య చంద్రుడు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments