పవన్ పంచ ప్రశ్నలు

Pawan Kalyan rise five questions to BJP

ఏపి రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాన్ చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించిన జనసేనాని వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అందుకే తన మకాంను ఇప్పటికే ఏలూరుకు మార్చిన పవన్ ఇప్పుడు మెల్లిగా ప్రజల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు.అందులో భాగంగా తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తన ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ఐదు ప్రశ్నలతో బిజెపి పార్టీని టార్గెట్ చేశారు.

గోవధ అంశంతో ప్రజల్లో భాయాందోళనలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోవధపై ఎందుకు నిషేధం విధించలేదని ప్రశ్నించారు. గోవధ అంశంపై బిజెపికి నిజాయతీ ఉంటే తోలుతో తయారు చేస్తున్న పాదరక్షలు, బెల్టులు ఎందుకు వాడుతున్నారని, వాటిని వాడకూడదని బీజేపీ కార్యకర్తలకు సూచించవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రతి బిజెపి కార్యకర్త ఒక్కో ఆవును పెంచుకోవాలని ఎందుకు సూచించడం లేదని పవన్‌ ప్రశ్నించారు. కేవలం గోవులను పూజించే వారిలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు, గో మాంసం తినే ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పలు అంశాల మీద ఆయన గురువారం ట్వీట్‌ చేశారు.

బీజేపీ- టీడీపీ కూటమి గెలుపు కోసం కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలోనే ప్రచారం చేయలేదని, కర్నాటకలో ఆ కూటమి గెలుపునకు జనసేన మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. అందుకే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తన ప్రశ్నలకు సంబంధించి ఎంతో మంది సీనియర్‌ రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, అనేక వర్గాలకు చెందిన ప్రజలతో పాటు బీజేపీని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన వారి నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాతే ఈ ప్రశ్నలు అడుగుతున్నానన్నారు. గోవధ, హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్ద నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా తదితర అంశాలపై బిజెపిని నిలదీయనున్నట్లు పేర్కొన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యపై శుక్రవారం(16డిసెంబర్ 2016) ట్వీట్‌ చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మీడియాకెక్కారు.మరి పవన్ ప్రశ్నలకు బిజెపి నుండి సమాధానాలు వస్తాయో లేదో చూడాలి.

 

Related posts:
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
సైన్యం చేతికి టర్కీ
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఏపీ బంద్.. హోదా కోసం
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
ప్యాకేజీ కాదు క్యాబేజీ
గెలిచి ఓడిన రోహిత్ వేముల
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బతుకు బస్టాండ్ అంటే ఇదే
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
ఆయన మాట్లాడితే భూకంపం
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
వంద విలువ తెలిసొచ్చిందట!
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments