చంద్రబాబుకు పవన్ లెంపకాయ

Pawan Kalyan slaps chandrababu Naidu with his statements

Pawan Kalyan slaps chandrababu Naidu with his statements.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ప్రత్యేక హోదా కోసం మూడంచెల ప్రణాళికలో భాగంగా 10.09.2016 తేదిన కాకినాడ సభలో ఎవరూ ఊహించని విధంగా సీమాంధ్రు ప్రజల ఆత్మగౌరవం అనే బ్యానర్ పెట్టి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఎక్కువ భాగం ఆత్మగౌరవం పైనే మాట్లాడటం జరిగింది. పవన్ స్పీచ్ అంతా కూడా తెలుగు రాష్ట్రాల విభజన, దాని చరిత్రకు సంబందించి ఉండటం విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్రాస్ నుండి ఎలా విడగొట్టారో, పొట్టిశ్రీరాములు త్యాగం, ఇందిరాగాంధీ ముందు చూపు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడంపైన, ఆ తర్వాత తెలంగాణ అణిచివేతకు గురికావడం, దానికి సీమాంధ్రులే కాదు తెలంగాణ నాయకుల పాత్ర ఉందని చెప్పడం జరిగింది.

ముల్కీ నిబంధనలు ఏ విధంగా తుంగలో తొక్కి తెలంగాణ వారికి అన్యాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలా అణిచివేతకు గురికావడం వల్లనే మళ్లీ తెలంగాణ ఉద్యమం జరిగిందని కారణాలు చెప్పారు. ఇంత జరిగినా, దాని పర్యవసనాలు చూసినా కూడా ఇంకా వారికి దక్కవలసినవి ఇవ్వకుండా అడ్డుపడటం ఏంటని ప్రశ్నించారు. అసలు రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం ఏంటని, తనను ఆ విషయం చాలా బాధ కలిగించిందని ఆవేదనపడ్డారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎందుకు చంద్రబాబు నాయుడు హైకోర్టు విడగొట్టడానికి సమ్మతించడం లేదని ఒక లెంపకాయ్ చంద్రబాబుకు వేశారు. ఇదిలా ఉంటే ఉమ్మడి హైకోర్టు విడగొట్టడానికి తెలంగాణ న్యాయవాదులు ఎన్నో ధర్నాలు చేశారు. దీనిపై ఎంపి కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎన్నో సార్లు విన్నవించుకున్నారు. 70 శాతం జడ్జిలు ఆంధ్రావాళ్లే అని, చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారని, నిలబడమంటే నిలబడతారని తెలంగాణ న్యాయవాదులు చెప్పుకోవడం గమనించవలసిన విషయం.

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
చంద్రుడి మాయ Diversion Master
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
చెత్త టీంతో చంద్రబాబు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
జగన్ క్రిస్టియన్ కాదా!
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
మోదీ భజన అందుకేనా?

Comments

comments