బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Pawan Kalyan strong warning to Chandrababu Naidu govt

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఫైరయ్యారు. ఈ సారి ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. సిక్కోలు(శ్రీకాకుళం) జిల్లాలో గత రెండు దశాబ్ధాలుగా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఇచ్చాపురం పర్యటనకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ వ్యాది బారినపడ్డ వారి దీనగాధలను పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా విన్నారు. తర్వాత ఇది తనకు ఎంతో బాధకలిగిందన్నారు. సమస్యను పరిష్కరించే విధంగా ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. ప్రజలను ఓటు బ్యాంకుగా తాను చూడడం లేదన్నారు. కిడ్నీ వ్యాధి ఒక విపత్తు అని అభివర్ణించారు. వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నా ప్రజాప్రతినిధి ఎందుకు స్పందించలేదన్నారు.

పుష్కరాలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఉద్దాన్నంలో చనిపోతున్నా..అనాథలవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేవలం ఓట్ల కోసం ఎందుకు ముందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు . పెద్దనోట్ల రద్దు అనంతరం ఎంతో డబ్బు బ్యాంకుల్లో వేశారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 6వేల కోట్ల మెడికల్ బడ్జెట్ ఉందన్నారు. డయాలీసిస్ సెంటర్లు పెట్టించామని మంత్రి పేర్కొంటున్నారని, డయాలిసీస్ అనేది చివరిగా వాడుతారని తెలిపారు.

ఉద్దానంతో పరిస్థితిపై  ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థితిగతులను పరిశీలించాలన్నారు. ఎంత మంది ప్రజలు బాధ పడుతున్నారు ? చికిత్స ఏ విధంగా ఆదుకోవాలో చూడాలన్నారు. ఇందుకు ఒక కమిటీ వేయడం జరుగుతుందని, డా.హరిప్రసాద్, సందీప్, అశోక్ యాదవ్..మిగతా ఇద్దరు కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. వైద్యులు దుర్గా ప్రసాద్, కృష్ణమూర్తిలు కమిటీతో పనిచేయాలని సూచించారు. సహాయ సహకారాలు అందించాలన్నారు. పదిహేను రోజుల తర్వాత వచ్చిన నివేదికను సీఎంకు..ప్రజాప్రతినిధులకు తానే స్వయంగా అందచేయడం జరుగుతుందన్నారు. 48గంటల్లో అనాథలైన వారికి ఏదో రకమైన ప్రభుత్వం సహాయం చేయాలని, మంత్రివర్గం నుండి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక అనంతరం కూడా స్పందించకపోతే తానే స్వయంగా దీనిపై ప్రజా ఉద్యమంగా చేస్తానని పవన్ హెచ్చరించారు. మొత్తానికి పవన్ హెచ్చరికతో తెలుగుదేశం నాయకుల్లో గుబులు మొదలైంది.

Related posts:
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
సైన్యం చేతికి టర్కీ
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
తిరిగబడితే తారుమారే
బెంగళూరుకు భంగపాటే
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ

Comments

comments