రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్

Pawan Kalyan targets BJP for Rohith Vemula

ఏపిలో రాజకీయాల వేడి రాజుకుంటోంది. అయితే ఏపి రాజకీయాల్లో తన ముద్రను ఇప్పటిదాకా స్పష్టంగా వెయ్యని జనసేన అధినేత ఇప్పుడు రంగంలోకి దిగాడు. గతంలో ఎన్నికల టైంలో కూడా పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా యుద్ధానికి రెడీ అవుతున్నాడు. నిన్న ట్విట్టర్ లో బిజెపి టార్గెట్ చేసిన పవన్ తాజాగా అదే పార్టీని మరోసారి టార్గెట్ గా చేసి రోహిత్ వేముల అంశాన్ని లేవనెత్తారు. రోహిత్ వేముల విషయంలో కేంద్రం ఏం చేసింది? అన్న అంశంపై పవన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

రోహిత్ వేములకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఒక మేధావిని దేశం కోల్పోయేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో స్పందించారు. రోజు ఒక అంశంపై ఇక పై స్పందిస్తానని చెప్పిన పవన్ అందుకు తగ్గట్టుగా  రోహిత్ ఘటనపై ట్విటర్లో  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాషాయికరణపై, తొందరపాటులో ఏదో అన్నందుకే రోహిత్ ను  క్యాంపస్‌ నుంచి పంపించారని అన్నారు. అలా చేసినందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. బీజేపీపై వ్యతిరేకత ఉన్నంత మాత్రాన రోహిత్‌ వేములను  వేధించే అధికారం ఆ పార్టీకి లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారివని వెల్లడించారు. రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు కేంద్రం ప్రయత్నించడం దారుణమన్నారు. రోహిత్‌కు అతని సామాజిక వర్గం నుంచి కూడా సహకారం అందలేదన్నారు. ప్రతి పార్టీ దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకుందని  ఆరోపించారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
కాటేసిందని పాముకు శిక్ష
సింగ్ ఈజ్ కింగ్
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
మా టీవీ లైసెన్స్ లు రద్దు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
ముద్రగడ సవాల్
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
BSNL లాభం ఎంతో తెలుసా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న

Comments

comments