ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం

Pawan Kalyan tweet on AP Special Status

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ లో బి.జె.పి. మీద విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్నికల హామీని తుంగలో తొక్కడాన్ని ఎటువంటి పరిస్థితులలో అనుమతించబోమని చెప్పారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ సాక్షిగా  బి.జె.పి. పై చేస్తున్న విమర్శల దాడిని ఆదివారం కూడా కొనసాగించారు. కేంద్రం లోని బి.జె.పి. ప్రభుత్వం ఆంధ్ర ప్రజలని వెన్నెముక లేని వాళ్ళు గా చూస్తోందని, మన ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో పేర్కొన్న ప్రత్యేక హోదాని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనని గుర్తు చేస్తూ, దశాబ్ద కాలం పాటూ అవమానాలకి, పరాభవాలకి గురి చేసి, రాజధాని కూడా లేకుండా, రెవెన్యూ లోటు గురించి పట్టించుకోకుండా, కట్టు బట్టలతో తరిమేశారని చెప్పారు. పార్లమెంట్ సాక్షి గా ప్రకటించిన ప్రత్యేక హోదాని అమలు చేస్తామని ఎన్నికల సంధర్భంగా ప్రకటించి, ఇప్పుడు దానిని ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తున్నారని, ఒక్క పేరులో తప్ప ఆ ప్యాకేజీలో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు.

జై ఆంధ్రా ఉద్యమంలో 400 మంది మరణించారని, అది ఆంధ్రులు ఎప్పటికీ మరచిపోలేరనీ, మరణించిన 400 మంది సాక్షిగా ప్రమాణం చెస్తున్నానని, ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పకుండా బి.జె.పి. ని వదిలేది లేదని తెలియజేశారు. ఇదిలా వుండగా 2019 ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన ఇటీవలే నిర్ణయించింది. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. గత కొద్ది రోజులుగా గోవధ గురించి , రోహిత్ వేముల గురించి, దేశభక్తి గురించి బి.జె.పి. ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే టిడిపి దెబ్బతో అడ్రసు వెతుక్కుంటున్న బిజెపి నాయకులకు జనసేన అధినేత కొత్త తలనొప్పిగా మారాడు.

Related posts:
ఇదో విడ్డూరం
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబు బండారం బయటపడింది
సల్మాన్ ను వదలని కేసులు
అడవిలో కలకలం
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments