టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?

Pawan-timing2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పొలిటికల్ లీడర్ జనసేనను స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీలో పాల్గొనలేదు. కానీ ఏపిలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపి పార్టీకి మద్దతుపలికారు. ఈ రెండు పార్టీలకు మద్దతు తెలుపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సభల్లో టిడిపి-బిజెపి కూటమికి మద్దతునివ్వాలని కోరారు. అయితే ఎన్నికలు ముగిశాయి. ఏపిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. తర్వాత పవన్ మాత్రం సైలెంట్ అయ్యారు.

ఒక్క రాజధాని భూముల అంశంలో తప్పితే వేరే ఏ ఒక్క అంశంపైనా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అయితే పొలిటికల్ ఎంట్రీ తర్వాత  ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలే తనకు ఆధారం అని చెప్పిన పవన్.. సినిమాల ద్వారా సంపాదించి కాస్త ఆర్థికంగా బలపడేందుకు సిద్దమవుతున్నానని అన్నారు. సినిమాలను పూర్తిగా మానేసి వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా బలపడి పోటీలో నిలవాటని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

రెండేళ్లు గడిచిపోయింది. ఏపిలో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేక గళం గట్టిగానే వినిపిస్తోంది. ప్రత్యేక హోదాపై మోదీని కూడా జనాలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పవన్ మాత్రం దేని మీద ఉన్నపళంగా స్పందించడం లేదు. తాజాగా ప్రత్యేక హోదా అంశంపైన కూడా ఆచితూచి మాట్లాడారు. తాను ఒక్కడి వల్లే ఏమీ కాదు అని భావిస్తున్నాను అని అన్నారు. అంటే తనకు బలం అవసరం అని, దాని కొసం ఎదురుచూస్తున్నాను అనేగా అర్థం.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఒక్కటే ప్రపంచం కాదని.. సినిమాలు కాకుండా కూడా జీవితం ఉంది అని అన్నారు. ఆ లెక్కన పవన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి.. ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా మారనున్నారు అని అర్థమవుతోంది. కానీ పొలిటికల్ గా కాస్త సైలెంట్ గా ఉన్నా కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తున్నాడు పవన్. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ప్రాణాలు వదిలిన రాంమూర్తికి ఐదు లక్షల సహాయం చేశాడు. తన కారు అమ్మి మరీ చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ కు సహాయం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించడం దగ్గరి నుండి అన్నింటా పవన్ టైమింగ్ ను నమ్ముకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి… కానీ ఆ టైంలో కూడా పవన్ బలంగా మాట్లాడాడు.. తెలుగు ప్రజలకు దొరికిన మరో అవకాశం అనే భావన కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఖచ్చితంగా గెలుస్తుందని తెలిసిన టిడిపి-బిజెపిలకు మద్దతుపలికి తన ఇమేజ్ ను మరియు గౌరవాన్ని పెంచుకున్నాడు.

ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు లభించినా కానీ ఎన్నికలకు మాత్రం ముందుకు రాలేదు. తన వద్ద డబ్బులేదు అని అందుకే పోటీకి దిగడం లేదు అని అన్నారు. కానీ అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యడం అంటే హెడ్స్ అండ్ టేల్ ఆడినట్లే అని పవన్ కు బాగా తెలుసు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుకు రాలేదు. ఇక ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచాయి. రాబోయే ఎన్నికలకు మరో రెండున్నర ఏళ్లు ఉంది.

ఇప్పుడు సినిమా మీద కన్నా రాజకీయాల మీద దృష్టిసారించి.. ఆ దిశగా ముందుకుసాగాలని ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. గతంలో తాను అనుకుంటే కేంద్రంలో  కానీ రాష్ట్రంలో కానీ ఏదో పదవి దక్కించుకొని సరిపెట్టుకోవచ్చు. కానీ పవన్ అలా చేయకుండా పవన్ వాళ్లకు బయటి నుండి మద్దతుపలికారు. పవన్ షార్ట్ టైం కాకుండా లాంగ్ టైం విజన్ తో ముందుకు వెళుతున్నట్లు అనిపిస్తోంది. టైమింగ్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఆ దిశగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Related posts:
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
చిరుకు పవన్ అందుకే దూరం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా లాభాలు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
చెత్త టీంతో చంద్రబాబు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments