పోరాటం అహంకారం మీదే

Pawan Kalyan will protest on that

Pawan Kalyan’s call to protest on South Indians Arrogance. On Kakinada meeting he digs out South Indians Arrogance issue.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సభా వేదికపై మరోసారి రెచ్చిపోయారు. గతంలో తిరుపతి సభలో కేవలం ప్రత్యేక హోదాపై మాత్రమే మాట్లాడిన పవన్ కాకినాడ సభలో మాత్రం కేవలం ఉత్తరాది వారు దక్షిణాది వారిపై చూపుతున్న వివక్ష చూపుతున్నారని, ఆ అహంకారంపై తన పోరాటం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపి విభజన సమయంలో సీమాంధ్ర ఎంపీలను పార్లమెంట్ వేదికగా, కోట్ల మంది సాక్షిగా బలవంతంగా బయటకు నెట్టి మరీ తెలంగాణ ఏర్పాటు చేస్తూ అవమానించారని పవన్ కాకినాడ వేదికపై గర్జించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నాడు మన సీమాంధ్ర ఎంపీలను బలవంతంగా బయటకు నెట్టివేస్తే బాధేసిందని పవన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు అని కానీ సీమాంధ్ర ఎంపీలను బయటకు పంపించిన విధానం తనకు నచ్చలేదని అన్నారు. అలాగే పార్లమెంట్ లో ప్రతి దక్షిణాది వ్యక్తిని ట్రీట్ చేసే విధానం పై కూడా ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ లో ఉత్తరాది ఎంపీలు మొత్తం  భారతదేశం తమదే అన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

కాకినాడ వేదికగా కాశ్మీర్ సైనికుల గురించి కూడా ఆయన చర్చించారు. కాశ్మీర్ లో సైనికులు గాయపడితే, చనిపోతే భారతీయులు తాము కూడా బాధపడ్డామని, ఉత్తరాది వాళ్లు ఎంత బాధపడ్డారోతాము కూడా అంతే బాధపడ్డామని ఆయన వెల్లడించారు. తన పోరాటం ఉత్తరాది అహంకారం మీదనే అని పవన్ వెల్లడించారు. నాడు కాంగ్రెస్, నేడు బిజెపిలు చేస్తున్నది అదే అని దుయ్యబట్టారు. మొత్తానికి పవన్ కాకినాడ వేదికగా కొత్త పాయింట్ ను లేవనెత్తారు.

కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య నాయుడుపై కూడా పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిగజార్చి, బిజెపి చేసే అహంకారపూరిత పనులకు సహాయం చేస్తూ ఉండటం మంచిది కాదు. కాబట్టి ఆ బిజెపి పార్టీ నుండి  మారిపోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

పార్లమెంట్ సాక్షిగా, కోట్లాది మంది ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అని పాచిపోయిన లడ్డూలు ఇస్తారా..? సీమాంధ్ర ప్రజలను అవమానిస్తారా..? మీరు ఏం చేసినా సీమాంధ్ర ప్రజలు పడి ఉంటారా..? మిమ్మల్సి దేహి అని మేం అడుక్కోవాలా..? చెప్పినవి చెయ్యడం మీ బాధ్యత కాదా..? అని సీమాంధ్రులు అంటే అంత లోకువా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని నిలదీయడానికి ఎందుకు భయపడుతున్నారు. మీకే ఆత్మగౌరవం ఉంటే వారిచ్చిన ప్యాకేజీలను తిరిగి ఇచ్చేయండి. ఎదైతే కేంద్రం  హామీలిచ్చారో దాని కోసం పోరాడండి అని చంద్రబాబు నాయుడుకు చెప్పడం జరిగింది. అదే విధంగా  ప్రజలకు మన ఆత్మగౌరవం కోసం వారి అహంకారం మీద పోరాటం చెయ్యాలని ఆవేశంగా పిలుపునిచ్చారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
అతడి అంగమే ప్రాణం కాపాడింది
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
బాబు బండారం బయటపడింది
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబు గారి అతి తెలివి
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
తెలంగాణ 3300 కోట్లు పాయె
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments