తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?

Pawan kalyan will question To Whom in Ananatup meeting

ఏపిలో రాజకీయ వేడి రాజుకుంది. విభజన సమయంలో హామీ ఇచ్చినట్లు ఏపికి ప్రత్యేక హోదా కేటాయించాలంటూ ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ జగన్ పోరాడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై రంగంలోకి దిగాడు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో ప్రజలకు ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పిస్తానని అన్నారు. అందులో భాగంగా తిరుపతి, కాకినాడల్లో పార్టీ సమావేశాలను నిర్వహించారు. అయితే తాజాగా కరువు జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

తిరుపతి సభలో, కాకినాడ సభలోనూ పవన్ దాదాపు బీజేపీని కార్నర్‌ చేశారు. హోదా విషయంలో పాచిపోయిన లడ్డూ ఇచ్చి మోసం చేశారని… అక్రోషాన్ని వెళ్ళగక్కాడు. అప్పట్లో మద్దతిచ్చినా… ప్రశ్నించే బాధ్యత తనమీద ఉందన్నమాటతో ఫ్యాన్స్‌ను తనవైపు తిప్పుకున్నాడు. పాచిపోయిన లడ్డూ ఇచ్చారన్న కామెంట్స్‌పై స్వయంగాకేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కౌంటరిచ్చారు. అటు టీడీపీ కూడా ‘తమ్ముడి’కి సర్ధిచెప్పే ప్రయత్నమే చేసింది. కానీ ఇప్పటి దాకా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దాంతో అనంత సభపై అందరూ చర్చకు తెర తీశారు.

ఇప్పటికే రెండు మీటింగ్ లలో ఎవరిని టార్గెట్ చేస్తాడు అనేది అందరికి ఆసక్తిరేపుతోంది. ఇప్పటి దాకా బిజెపిని టార్గెట్ గా చేసిన పవన్ మరి టిడిపిని టార్గెట్ గా చేస్తారా..? అంటే అది ఇప్పుడు తేలే ప్రశ్న కాదు. సరే రెండు పార్టీలను నిలదీస్తాడు అంటే… మరి రాబోయే ఎన్నికల్లో ఎవరితో జతకడతాడు ? రాజకీయాల్లో ఏ పార్టీ ఎల్లవేళలా శత్రవు కాదు.. అలాగని ఎల్లవేళలా మిత్రులూ కాదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కనీస బలం కూడా లేని పవన్ ఎవరితో జతకడతారు..? ఇప్పుడు ఇలా విమర్శలకు దిగితే భవిష్యత్ లో ఆ పార్టీలు పొత్తుకు సిద్దమవుతాయా..?

గతంలో బీజేపీని పవన్‌ కళ్యాణ్‌ ఇరుకున పెట్టేలా మాట్లాడారు. మోడీని సైతం విమర్శించారు. ఆ తర్వాత ఒకరిద్దరు నాయకులు ఆ వ్యాఖ్యల్ని సమర్ధించి గబ్బర్‌సింగ్‌ని శాంతపరిచేందుకు ప్రయత్నించారు. ఆ ప్లాన్‌ వర్కౌట్‌ అవ్వకపోవడంతో రూటు మార్చేశారు. ఎన్డీయేలో పవన్‌ భాగస్వామి కాదని, గత ఎన్నికల్లో మద్దతు మాత్రమే ఇచ్చాడని తేల్చేశారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న బంధం కాస్తా తెగిపోయినట్లైంది.

ఇక తెలుగుదేశంతో అయితే పవన్ స్ట్రాటజీ ఎలాంటిదో ఎవరికి అర్థంకావడం లేదు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు.. కానీ అదే టైంలో చంద్రబాబు గురించి పళ్లెత్తి ఒక్క మాట కూడా అనరు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? మరోపక్క పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు టిడిపి, బిజెపిని టార్గెట్ గా చేసి సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. జనసేన పార్టీని అంచెలంచలుగా విస్తరించడంలో భాగంగా పవన్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే అనంతలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి ఈ మీటింగ్ లో తమ్ముడు ఎవరిని టార్గెట్ చేస్తారు..? అనేది చూడాలి.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
అడకత్తెరలో కేసీఆర్
ఆ అరుపులేంటి..?
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
మద్యల నీ గోలేంది..?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
ఇక యుద్ధమే కానీ..
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments