నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!

Pawan Withdrawn His Support From TDP

Pawan Withdrawn His Support From TDP. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘జనసేన’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనే ఈయన ఎన్నికల బరిలో నిలబడకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో చంద్రబాబుకున్న పూర్వ అనుభవం, మోడీపై నమ్మకం దృష్ట్యా ఆ రెండు పార్టీల తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత కూడా ఈ రెండు పార్టీలతో తన మైత్రి కొనసాగించారు. ఎంతలా అంటే.. తన పార్టీ జెండా, ఎజెండాను పక్కనపెట్టి మరీ వాటికి సపోర్ట్‌గా నిలిచారు.

అయితే.. ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తుంటే రాబోయే ఎన్నికల్లో పవన్ తరఫు నుంచి ఆ రెండు పార్టీలకు ఎలాంటి మద్దతు అందదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందుకు కారణం.. ఎన్నికల ముందు బీజేపీ ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ఇస్తానని మాటిచ్చి, ఇప్పుడు ప్రత్యేక సహాయంతో చేతులు దులిపేయడం.. అలాగే టీడీపీ ఇచ్చిన హామీలను సరిగ్గా నిర్వర్తించకపోవడం, బీజేపీతో పోరాడి ప్రత్యేకహోదాని రాబట్టుకోవడంలో విఫలం కావడమేనని అర్థం చేసుకోవచ్చు.

నిజానికి.. తిరుపతిలో సభ పెట్టకముందు పవన్ సైలెంట్‌గా ఉండడాన్ని చూసి ఆ రెండు పార్టీల కనుసైగలో అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వచ్చే ఎన్నికల వరకు పవన్ ఊసే ఉండదని, ఆయన నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ప్రశ్నలు ఎదురుకావని చెప్పుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఆయన తిరుపతిలో సభ పెట్టడం, ప్రత్యేకహోదా అంశాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడడంతోపాటు బీజేపీ, టీడీపీ పార్టీలను ఏకిపారేశారు. కానీ.. ఏపీలో జగన్ చేస్తున్న వ్యూహాల్ని ప్రజల దృష్టి నుంచి మార్చేందుకు టీడీపీ పవన్‌ని రంగంలోకి దింపినట్లుగా రాజకీయ నేతలు, విశ్లేషకులు పెదవి విరిచారు.

అయితే.. కాకినాడలో నిర్వహించిన సభలోనూ బీజేపీ, టీడీపీపై పవన్ విరుచుకుపడిన విధానాన్ని గమనిస్తే.. ఆ రెండు పార్టీలతో ఈయన దూరమవుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల కోసమే తన పోరాటమంటూ, ఈ పోరాటాలు రాజకీయ నేతలే చేయాలని, వారిపై ఒత్తిడి తీసుకురావడమే తన బాధ్యతని చెప్పడం బట్టి చూస్తే.. ఆ రెండు పార్టీలకు పవన్ మద్దతు లేనట్టేనని స్పష్టం అవుతోంది.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
మెరుపు దాడి... నిజమా-కాదా?
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
పైసలు వసూల్ కాలేదుగా..
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments