కరెన్సీ కష్టాల నుండి విముక్తి

people are in que for that machines at banks

దేవుడు ఎక్కడున్నాడు అని ఎవరినైనా అడిగితే వచ్చే సమాధానం ఏంటి? దేవుడు సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉన్నాడు అనే సమాధానం వస్తుంది. మరి అలాంటి దేవుడికి కూడా ఇప్పుడు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి.  ఇప్పుడు దేవుడికి గిరాకీ తగ్గింది. అవును దేవుడి కంటే కూడా ఓ వస్తువుకు మాత్రం గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ ఈ కష్టాల నుండి ఆ వస్తువు మాత్రం తమని గట్టెక్కిస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు. అందుకే ఆ వస్తువును సొంతం చేసుకునేందుకు క్యు కడుతున్నారు. ఇంతకీ ఆ వస్తువు ఏంటీ అనుకుంటున్నారా? స్వైపింగ్ మెషీన్.

స్వైపింగ్ మెషిన్.. చిల్లర కష్టాల నుంచి గట్టెక్కిస్తూ.. వ్యాపారులకు లక్ష్మీదేవిలా.. కాసులు కురిపిస్తోంది. ఇది ఎక్కడుంటే.. అక్కడే జనం ఉంటున్నారు. పెద్దనోట్లు రద్దైనా.. నేతలు పట్టించుకోకపోయినా.. బ్యాంకులు, ఏటీయంలు కరుణించకపోయినా.. జనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏకైక యంత్రం స్వైపింగ్ మెషిన్. దీంతో ఇప్పుడు ఈ మెషిన్ కోసం పరుగులు పెడుతున్నారు వ్యాపార సంస్థల యజమానులు.. చిన్న చిన్న దుకాణదారులు. తమ గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ప్రైవేటు , ప్రభుత్వ బ్యాంకులు స్వైపింగ్ మెషిన్ల కొంత మందికి సమకూరుస్తున్నాయి.

దాంతో దేవుడిని నమ్ముకోవడం కంటే స్వైపింగ్ మెషీన్ ను నమ్ముకుంటే తమ చిల్లర కష్టాలు తీరుతాయని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బ్యాంకుల ముందు స్వైపింగ్ మెషీన్ల కోసం పెద్ద క్యు కడుతున్నారు. అయితే స్వైపింగ్ మెషీన్లను అందరికీ ఇవ్వడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఈ SAM ఏంటి గురూ..?
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
జియో భారీ ఆఫర్ తెలుసా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments