నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?

People Shoot the live Murder in their Cams

మానవత్వం మంటకలిసింది. టెక్నాలజీ పుణ్యమా మనం కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమే కానీ.. అదే టెక్నాలజీ మూలనా మన మూలాలను మరిచిపోతున్నాము. దుబాయ్ లో ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే దాని మీద స్పందిచాల్సిందిపోయి చాలా మంది అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేశారు. అలాగే నేపాల్ లో భారీ భూకంపం వచ్చి అంతా నాశనం అయితే చాలా మంది సెల్ఫీలు తీసుకొని పోస్ట్ లు పెట్టడం దురద్రుష్టకరం. కానీ మన దగ్గర అంతకన్నా దారుణం చోటుచేసుకుంది. కళ్లెదుట ఓ మర్డర్ జరుగుతున్నా.. సెల్ ఫోన్లలో షూట్ చేశారు కానీ ఎవరూ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చెయ్యలేదు. కర్ణాటక రాష్ట్రం హసన్ పట్టణంలో చోటుచేసుకుంది ఈ ఘటన.

ఒక యువకుడికి కత్తిపోటుతో నెత్తురోడుతూ ఆ యువకుడు బాధతో నేలపైపడి విలవిల్లాడుతుంటే వేడుక జరుగుతున్నట్లుగా.. వారి వారి సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించేందుకు పోటీ పడటం విచిత్రం. మానవత్వం మంటగలిసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా..? కర్ణాటకలోని హసన్ పట్టణంలో మంగళవారం ఓ యువకుడు బస్టాండ్‌లో నిలుచున్న ఓ అమ్మాయిని వేధించాడు. అక్కడున్న మరో ఇద్దరు యువకులు అతడితో గొడవపడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపులు రోడ్డుపై కొట్టుకున్నారు. ధనుష్ అనే యువకుడు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోగా అక్కడున్నవారిలో ఒక్కరుకూడా ముందుకురాలేదు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొన్నాయి.

 

 

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
బాబోయ్ బాబు వదల్లేదట
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఏపీ బంద్.. హోదా కోసం
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ఆ సిఎంను చూడు బాబు...
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?

Comments

comments