పెట్రోల్ లీటర్‌కు 250

Petrol Price Reached to Two Hundred fifty rupees

రెండు వందల యాభై రూపాయలకు లీటర్ పెట్రోల్ అంటే మీరు నమ్ముతారా.? ఇప్పుడు కాదులే కానీ ముందు ముందు మాత్రం అదే రేట్ వస్తుందని అనుకుంటున్నారు కదూ. కానీ ఇప్పుడే లీటర్ ధర ఏకంగా రెండు వందల యాభై రూపాయలకు చేరుకోవడం సంచలనం రేగింది. వేరే దేశాల్లో అనుకుంటున్నారేమో.. మన దేశంలోనే లీటర్ పెట్రోల్ అలా మండిపోతోంది. ఇంతకీ ఎక్కడ ఈ ధర అనే ప్రశ్న వస్తుంది కదూ. అస్సాంలో ప్రకృతి వైపరిత్యాల కారణంగా జనాలకు ఇప్పటికే చుక్కలు కనబడుతుంటే.. ఇప్పుడు తాజాగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.

అస్సాంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి పరిస్థితిని చక్కబెట్టడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. అక్కడ భారీ వర్షాల కారణంగా రోడ్డు వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. భారీ వర్షాలతో ఎనిమిదో నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. 20కిలోమీటర్లవరకూ బురదతో నిండిపోయింది. దీంతో ఈ రోడ్డునుంచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 4వేల 500లకుపైగా ట్రక్కులు రోడ్డుపైనే ఆగిపోయాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మందులు, ఆహారం, ఇంధనంలేక అల్లాడిపోతున్నారు.

ఇక నేషనల్ హైవే పైనే ఇలా పరిస్థితి మారడంతో అక్కడ నిత్యావసరాలు అమ్మే వాళ్ల దగ్గరి నుండి అందరూ కూడా రేట్లను పెంచేశారు. అలా తినే ఉప్పు.. పప్పుతో సహా అన్నింటి రేట్లను పెంచడంతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అన్నింటికి మించి లీటర్‌ పెట్రోల్‌ ధర 250 రూపాయలకు చేరడంతో జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దిగ్భందణంలో చిక్కుకున్నట్లు ఉంది అక్కడి పరిస్థితి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్కడి వ్యాపారులు చేస్తున్న అత్యాశతొ వాహనదారులకు తీవ్ర కష్టాలు వస్తున్నాయి.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
వంద, యాభై నోట్లు ఉంటాయా?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
శోభన్ బాబుతో జయ ఇలా..
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
అందుకే భూకంపం రాలేదట
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments