గాలిలో విమానం.. అందులో సిఎం

Plane Problem Shows Mamata Banerjee Life In Danger

దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత మోదీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు విపక్షనేతలు. అందులో ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ మీద తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాగా మమతా బెనర్జీ పాట్నాలో ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి కలకత్తాకు బయలుదేరింది. కాగా ఆమె ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం సరిపడినంత ఇంధనం నింపకుండా బయలుదేరేలా చేశారని త‌ృషముల్ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ లో చాలా హంగామా చేశారు.

మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానంలో ఇందనం తక్కువగా ఉందని విమాన పైలట్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్ కి తెలిపి అత్యవసరంగా విమానం ల్యాండింగ్ కి అనుమతించవలసిందని కోరినప్పటికీ, సాంకేతిక కారణాల చేత సుమారు అర్ధగంటసేపు అనుమతివ్వలేదని, అంతసేపు ఆ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టవలసి వచ్చిందని తృణమూల్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అది గాలిలో ఉండగానే దానిలో ఇందనం పూర్తిగా ఖాళీ అయిపోతే కూలిపోతే దానికి ఎవరు భాద్యతవహిస్తారని ప్రశ్నించారు.

తృణముల్ కాంగ్రెస్ నాయకులు చేసిన అందోళన మీద కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సమాధానమిచ్చారు. ఆ విమానం ల్యాండింగ్ అవడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే సమయం తీసుకొన్నారని చెప్పారు. అయినా ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే విమాన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం గ్రౌండ్ కంట్రోల్ ప్రత్యేక పద్దతిలో అనుమతి కోరవలసి ఉంటుందని, సామాన్య పద్దతిలో కోరితే క్రిందన ఉన్న పరిస్థితులని బట్టి ప్రాధాన్యత క్రమంలో విమానాల ల్యాండింగ్ కి అనుమతిస్తుంటారని మంత్రి చెప్పారు. అయితే తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మమతా బెనర్జీని చంపడానికి చేసిన ప్లాన్ అనేలా సీన్ క్రియేట్ చేశారు. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి డిజిసిఎ ని ఆదేశించామని, ఆ నివేదిక రాగానే పార్లమెంటుకి దానిని సమర్పిస్తానని మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
నయీం బాధితుల ‘క్యూ’
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సల్మాన్ ను వదలని కేసులు
2018లో తెలుగుదేశం ఖాళీ!
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
నారా వారి అతి తెలివి
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
మోదీ ప్రాణానికి ముప్పు
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
BSNL లాభం ఎంతో తెలుసా?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్

Comments

comments