మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ

PM Narendra Modi shocks BJP Lawmakers

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి బాంబ్ పేల్చారు. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా రకరకాల విమర్శలు, విపక్షాల నుండి నిరసనలు ఎదుర్కుంటున్న సమయంలో మరోసారి మోదీ బాంబ్ పేల్చడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ సారి సామాన్యుల మీద కాకుండా తమ సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మీదనే బాంబ్ పేల్చడం వార్తల్లో నిలిచింది. ఇంతకీ మోదీ ఏం బాంబ్ పేల్చారు అనుకుంటున్నారా? బిజెపికి చెందిన ప్రజాప్రతినిధుల బ్యాంకు లావాదేవీల వివరాలను ఇవ్వాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు.

దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి ప్రజాప్రతినిధులందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ మేరకు స్పష్టంచేశారు. పెద్ద నోట్ల రద్దు అమల్లోకి వచ్చిన నవంబరు 8వ తేదీ నుంచి డిసెంబరు 31వరకు నిర్వహించే బ్యాంక్ లావాదేవీలను బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు వెల్లడించాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు బిజెపి పార్లమెంటరీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తానికి సొంత పార్టీ నుండే ప్రక్షాళన మొదలుపెట్టాలని మోదీ నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకే తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఖాతాలను పారదర్శకంగా ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
అతడి అంగమే ప్రాణం కాపాడింది
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కాటేసిందని పాముకు శిక్ష
తాగుబోతుల తెలంగాణ!
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
వీళ్లకు ఏమైంది..?
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఆట ఆడలేమా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
బాబు బిత్తరపోవాల్సిందే..
సౌదీలో యువరాజుకు ఉరి
ఆ సిఎంను చూడు బాబు...
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
అకౌంట్లలోకి 21వేల కోట్లు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
BSNL లాభం ఎంతో తెలుసా?

Comments

comments