పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్

pokimon go game danger bells

టెక్నాలజీ మనల్ని చాలా దూరం తీసుకెళుతోంది అన్నది వాస్తవం. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్లను ఒకే దగ్గరికి చేర్చిన టెక్నాలజీ.. దగ్గరగా ఉన్న వాళ్లను దూరం చేస్తోంది. ఇదే టెక్నాలజీ వల్ల జనాలు పిచ్చెక్కిపోతున్నారు అన్నది వాస్తవం. తాజాగా ఓ కొత్త గేమ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎంతలా అంటే ఆ గేమ్ ను వెంటనే కొన్ని కోట్ల మంది తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని తెగ వాడేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ గేమ్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇప్పటికే ఈ గేమ్ వల్ల ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గేమ్ వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..?

పోకిమన్ గో అనే గేమ్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జనాలు అభిమానులుగా మారారు.ఆ గేమ్ విడుదలైన వెంటనే కోట్ల మంది ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ ఆ గేమ్ ఆడుతూ ఆడుతూ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా కారు ఆమెను తప్పించబోయి వేరే కారును ఢీకొట్టాడు. ఆ వెనకి కారును ఇంకో కారు.. ఇలా చాలా కార్లు గాల్లోలేచాయి. కానీ ఆ అమ్మాయి మాత్రం గేమ్ లో బాగా లీనమైంది. ఇంకో అమ్మాయి గేమ్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఏకంగా చెరువులోకి వెళ్లింది. గతంలో సెల్ఫీల పిచ్చి మొదలైనప్పుడు కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి.అందుకే ఈ గేమ్‌ను ఖాళీ సమయాల్లో, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆడాలని అమెరికా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఆటలా..? యుద్ధమా..?
స్టే ఎలా వచ్చిందంటే..
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
మోదీ మీద మర్డర్ కేసు!
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్

Comments

comments