తమిళనాట అప్పుడే రాజకీయాలా?

political crisis in Tamilnadu after jayalalitha's death

తమిళనాట జయలలిత శకం ముగిసింది. కోట్ల మంది హృదయాల్లో ఆమె చెక్కు చెదరని ముద్రను వేసి వెళ్లిపోయారు. ఇక జయ మరణం తర్వాత అందరూ కూడా తమిళ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడంలో టాప్ లో ఉండే తమిళనాట జయలేని రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అందరికి చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఏఐడిఎంకే పార్టీలో చీలకలు అనే వార్త అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. జ‌య‌ల‌లిత చ‌నిపోయి రెండ్రోజులు గ‌డ‌వ‌లేదు. ప‌న్నీర్ సెల్వం ఇంకా సీఎంగా కుదురుకోలేనే లేదు. అప్పుడే పార్టీలో చీలిక‌లా..?

అవును జ‌య‌ల‌లిత ఎంతో విజ‌య‌వంతంగా ఒక్క చేత్తో న‌డిపించిన పార్టీ.. ప్ర‌భుత్వం త్వ‌ర‌లో రెండుగా చీలుతాయ‌ని బాంబు పేల్చారు బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి. అన్నా డీఎమ్‌కే పార్టీని చీల్చేది.. మ‌రెవ‌రో కాద‌ట‌. జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీని గుప్పిట్లో పెట్టుకొని.. ప‌న్నీరు సెల్వానికి చుక్క‌లు చూపిస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.పార్టీలో పెద్ద‌గా బేస్ లేని ప‌న్నీర్ సెల్వాన్ని దించేందుకు శ‌శిక‌ళ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న్నారు. పార్టీ, ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పెరిగి గంద‌ర‌గోళానికి దారీ తీస్తుంద‌ని.. ప‌న్నీర్‌కు నిర్ణ‌యాల్లో పూర్తి స్వేచ్చను శ‌శిక‌ళ‌ ఇవ్వ‌ద‌న్నారు సుబ్రమణ్య స్వామి పార్టీతో పాటు ప్ర‌భుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప‌న్నీర్ సెల్వాన్ని సీఎం ప‌ద‌వి నుంచి దించేస్తుంద‌న్నారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణ ప్ర‌క‌ట‌న జ‌రిగిన‌ కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి ఏఐడీఎమ్‌కే ఓ పార్టీలా ముందుకు సాగ‌ద‌ని.. ప్ర‌భుత్వంది ఓ దారి.. పార్టీది మ‌రో దారి ఉంటుంద‌న్నారు స్వామి. శ‌శిక‌ళ రెండిటిపై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. మ‌రోవైపు ఇపుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకున్న ప‌న్నీర్ సెల్వాన్ని దించేసి.. ఆమె కుటుంబానికి చెందిన న‌మ్మ‌క‌స్తుడిని ఆ సీట్లో కూర్చొబెడుతుందంటూ స్వామి వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఎపుడూ ఎదో సంచ‌ల‌నాలు మాట్లాడే స్వామి.. ఇపుడు శ‌శిక‌ళ‌ను టార్గెట్ చేశారు. అయితే జ‌య‌, శ‌శిక‌ళ‌ల టార్గెట్‌గా.. ఆయ‌న వేసిన అక్ర‌మాస్తుల కేసు.. ఇద్ద‌రికి చుక్క‌లు చూపించాయి. ఇపుడు జ‌య మ‌ర‌ణంతో.. శ‌శిక‌ళ‌ను టార్గెట్ చేస్తున్నారు స్వామి.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఆటలా..? యుద్ధమా..?
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
జియోకే షాకిచ్చే ఆఫర్లు
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నారా వారి అతి తెలివి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
అతి పెద్ద కుంభకోణం ఇదే
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
దేశభక్తి అంటే ఇదేనా?
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
బీసీసీఐకి సుప్రీం షాక్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments