కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?

Politicial agenda behind the new districts concept

తెలంగాణ సీఎం కేసీఆర్ అప‌ర చాణ‌క్యుడు.. వ్యూహాలు ర‌చించ‌డంలో వాటిని వేగంగా అమ‌లు చేయ‌డంలో ఆయ‌న ముందుంటారు… ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌ను కొడ‌తారు… ఈసారి జిల్లాల ఏర్పాటుతో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల ఖిల్లాల‌ను కేసీఆర్ కూల్చివేశార‌ని చెబుతున్నారు…. తెలంగాణ‌లో త‌న‌కు స‌వాళ్లు విసురుతున్న కాంగ్రెస్‌, టీడీపీల‌కు చెందిన బ‌డా నేత‌ల కంచుకోట‌ల‌ను కేసీఆర్ కూల్చేశార‌ని స్థానిక రాజ‌కీయ‌వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి… అందుక‌నే జిల్లాల ఏర్పాటులో కేసీఆర్‌ కుట్ర దాగి ఉంద‌ని రేవంత్‌రెడ్డి ఆక్రోశిస్తున్న‌ట్టు ఆ వ‌ర్గాలు చెబుతున్నాయి.. కొత్త జిల్లాల మాటున దాగిన కుట్ర‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని టీ టీడీపీ నేత రేవంత్ అంటున్నారు.

జిల్లాల విభ‌జ‌న పేరుతో నియోజ‌క‌వ‌ర్గాల డీలిమిటేష‌న్‌పై ప్ర‌భావం చూపేలా కేసీఆర్ కుట్ర చేశార‌ని, దీని గురించి కేంద్ర హోం శాఖకు, న్యాయ శాఖ‌కు వివ‌రిస్తామంటున్నారు రేవంత్‌… కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోతే సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని రేవంత్ చెబుతున్నారు… అస‌లు రేవంత్ ఆక్రోశానికి కార‌ణం ఏంటంటే…

తెలంగాణ‌లో ఎదిగివ‌స్తున్న నాయ‌క‌త్వాన్ని, భవిష్య‌త్తులో త‌న‌కు ముప్పుగా ప‌రిణ‌మించే బ‌డా నేత‌ల ఖిల్లాల‌ను జిల్లాల ఏర్పాటుపేరుతో కేసీఆర్ కూల్చివేస్తున్నార‌ని రేవంత్ ఆరోపిస్తున్నారు..త‌న‌కు అడ్డంకిగా ఉన్న‌నేత‌ల‌ను అడ్డంగా దెబ్బ తీయ‌డానికి జిల్లాల పేరుతో కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నార‌ని రేవంత్ అంటున్నారు. ఈ య‌వ్వారంలో కాంగ్రెస్ కూడా కేసీఆర్‌తో చేతులు క‌లిపింద‌నేది ఆయ‌న వాద‌న‌… కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌న డీ లిమిటేష‌న్ జ‌రిగితే దాని ప్రభావం నియోజ‌క‌వర్గాల‌పై ప‌డుతుంద‌ని రేవంత్ చెబుతున్నారు.. డీలిమిటేష‌న్‌కు ముందుగానే స‌రిహ‌ద్దులు ప‌రిధి మార్చి తాను అనుకున్న‌విధంగా నియోజ‌క‌వ‌ర్గాలకు రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చేలా కేసీఆర్ కుట్ర ప‌న్నార‌ని రేవంత్ ఆరోపిస్తున్నారు. నేత‌లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, భ‌ట్టివిక్ర‌మార్క‌, గీతారెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్యల నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీల నుంచి జ‌న‌ర‌ల్‌గా మారిపోతాయ‌ని రేవంత్ గ‌గ్గోలు పెడుతున్నాడు.. అయితే కొత్త జిల్లాల ఉత్సాహంలో ఉన్న జ‌నం, నేత‌లు రేవంత్ గోడును ప‌ట్టించుకోవ‌డం లేదు.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ఆయనకు వంద మంది భార్యలు
కాటేసిందని పాముకు శిక్ష
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఆరిపోయే దీపంలా టిడిపి?
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
మా టీవీ లైసెన్స్ లు రద్దు
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
అంత దైర్యం ఎక్కడిది..?
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
సదావర్తి సత్రం షాకిచ్చింది
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
చెబితే 50.. దొరికితే 90
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
తిరిగిరాని లోకాలకు జయ
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
251రూపాయల ఫోన్ ఇక రానట్లే

Comments

comments