చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం

Chiru-150

మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాను వివి వినాయక్ దర్శకత్వం చేస్తున్నాడు. కాగా చిరంజీవి చేస్తున్న ఈ సినిమా చిరును మరో మెట్టు ఎక్కించేలా ఉంది అని అందరూ భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత Boss is back అంటూ వస్తున్న మెగాస్టార్ కు ఈ సినిమా వెనక చాలా రాజకీయం ఉంది అని తెలుస్తోంది. సినిమాల్లో మొన్నటి దాకా ఓ వెలుగు వెలగి.. తర్వాత పాలిటిక్స్ లోకి చేరి తన ప్రతిష్టకు కాస్త మసకబార్చుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి చిరు మేనియా మొదలుకానుంది అని తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం ద్వారా పొలిటికల్ ఎంట్రీని తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఇచ్చిన మెగాస్టార్ నాడు ఎంతో హైప్ ను క్రియేట్ చేశారు. కానీ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పొలిటికల్ గా రాణించలేకపోయారు. దాంతో చివరకు చేసేదేంలేక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే కాంగ్రెస్ లోకి చిరు చేరినప్పటి నుండి పెద్దగా ప్రజాదరణ లేకుండాపోయింది. కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిరు గతంలో ఉన్న అభిమానం, ఆదరణ పొలిటికల్ యాంగిల్ లో లేకుండాపోయింది.

సినిమాల్లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎవరూ అందుకోలేని స్థానాన్ని చేరుకున్నారు చిరంజీవి. కానీ రాజకీయ రంగంలో మాత్రం ఆయన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. చిరు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కూడా అప్పుడప్పుడూ తన చరిష్మాను చూపించే ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు చిరంజీవి తన 150వ సినిమాతో ఇటు సినిమా రంగంతోపాటు పొలిటికల్ గా కూడా లాభపడేందుకు చూస్తున్నారా అనిపిస్తోంది.

Also Read:  చిరుకు పవన్ అందుకే దూరం

Also Read:  టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?

Alsp Read:  జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే

చిరు సినిమాతో ఎలా లాభం పొందుతారు అని అనుకుంటున్నారా.? మెగాస్టార్ 150వ సినిమా ఎంచుకున్న స్టోరీ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. చిరంజీవి ఎంచుకున్న ఖైదీ నెంబర్ 150లో రైతుల అవస్థల మీద ఓ రెబల్ చేసే పోరాటంగా ఈ సినిమా తెరకెక్కింది. కష్టపడి ఆరుకాలాలు కష్టపడుతున్న రైతులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి ఇలా రైతుల కష్టాలకు స్పందించే పాత్రతో మరోసారి తెలుగు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని చిరు చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అన్నదే అసలు ప్రశ్న.

చిరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుండి ఉన్న బలం.. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోవడమే. మరి అలాంటి అభిమానులని తయారు చేసిన సినిమానే మరోసారి ప్రయోగించి చిరు తెలుగు ప్రజలకు దగ్గరయ్యేందుకు, పొలిటికల్ గా మెరిసేందుకు ప్రయత్నిస్తున్నారు అని అనిపిస్తోంది. చిరు బర్త్ డే వేడుకల్లో కూడా సి. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.సమాజం కుళ్లిపోయిందని.. సామాజిక న్యాయం దెబ్బతిందని మొదలుపెట్టి.. చిరంజీవి సినిమా రంగంలో ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్నారని..మీరు ఇంకా కొంచెం ఆదరిస్తే రాజకీయంగా ఇంకా ఎత్తులో మేము తనను(చిరు) ఉంచుతామని అన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఖచ్చితంగా రాజకీయ కోణమే.

ప్రజారాజ్యం అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సొంత పార్టీని నడిపించడంలో విఫలమై.. చివరకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందివచ్చిన పర్యాటక శాఖ కేంద్ర మంత్రి పదవిని అప్పనంగా అందుకున్నారు. ఇప్పుడు మరి మరోసారి తన బలమైన సినిమా ద్వారానే తనను తాను మరోసారి రాజకీయరంగంలో రాణించాలని అనుకుంటున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. మరి చిరు వేసిన ఈ పాచిక రాజకీయంగా ఎంత వరకు తనకు మేలుచేస్తుందో చూడాలి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
అహా... అందుకేనా..?!
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments