పివి సింధు విజయం.. వెనక రాజకీయం

Politics Behind PV Sindhu Game in Rio Olympics

రియో ఒలంపిక్స్ వేదికపై మన తెలుగుతేజం పివి సింధు మెరుపులు మెరిపించింది. సిల్వర్ మెడల్ ను సాధించి భారత క్రీడాలోకానికి మరో కీర్తిని సాధించింది. దేశం మొత్తం ఆమెను అభినందనల్లో ముంచెత్తింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సింధు మీద రాజకీయాలు మొదలయ్యాయి. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఆరంభమైన ఈ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు చేరింది. జగన్, కేసీఆర్ లతో సహా పుల్లెల గోపీచంద్, సింధు తండ్రి రమణ వరకు రాజకీయం రంగులు మార్చుకుంది.

పివి సింధులాంటి మేటి క్రీడాకారులు ఒలంపిక్స్ లో విజయం సాధిస్తున్నారు అంటే అది తన కృషి అని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుల్లెల గోపీచంద్ లాంటి వాళ్లను ప్రోత్సహించినందు వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఇక వైయస్ జగన్ చెల్లెలు షర్మిల మాత్రం తన అన్న జగన్ నిండు మనసుతో గెలవాలని ఆకాంక్షించడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.

ఇక తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే ఇది సాధ్యమైందని తెలంగాణ నేతలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఎంతో సహకరించింది అని సింధు తండ్రి రమణ వెల్లడించారు. పివి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా దీనిపై స్పందించారు. అప్పట్లో చంద్రబాబు సహకరించడం వల్లే అకాడమీ పెట్టగలిగానని.. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం తన అకాడమీకి ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రయత్నించారని అన్నారు. ఇలా మొత్తంగా పివి సింధు మెడల్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేసింది అన్నది వాస్తవం. నాయకుల మాటలు ఎలా ఉన్నా.. పివి సింధు ఆటతీరును మాత్రం మెచ్చుకోవాల్సిందే.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఇదే జగ‘నిజం’
పవన్ మాస్టర్ స్కెచ్
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
టాప్ గేర్ లో ముద్రగడ
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
తొక్కితే తాటతీస్తారు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
పవన్ క్షమాపణలు చెప్పాలి

Comments

comments