కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం

tamilnadu

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అంటే ఏంటో తమిళనాడు, కర్ణాటలను చూస్తే తెలుస్తుంది. కోర్టు పరిధిలో జరిగిన తీర్పులకు అక్కడ ప్రజలు స్పందించిన తీరు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. కావేరీ జలాలా వివాదంలో ఇప్పటికే కర్ణాటక నిప్పుల కుంపటిగా మారింది. వందలాది బస్సులు, ఇతర వాహనాలు, దుకాణాలు, హోటల్స్ ఆందోళనకారుల చేతిలో కాలి బూడిదైపోతున్నాయి. కర్నాటకలో తమిళనాడుకి చెందిన వాహనాలు, హోటల్స్, దుకాణాలపై దాడులు జరుగుతుంటే, తమిళనాడులో కర్నాటకకి చెందిన ఆస్తులు, వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.

కావేరీ జలాలా పేరుతో జరుగుతున్న ఈ పోరాటం వెనక నిజంగా ఎలాంటి దురుద్దేశం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయంగా ఇప్పటికే కర్ణాటకలో పెద్ద కుట్ర జరుగుతోంది అని అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే కావేరీ జల వివాదం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాదు. గతంలో కూడా ఆ రెండు రాష్ట్రాలు చాలాసార్లు గొడవ పడ్డాయి. రెండు రాష్ట్రాలలో ఆందోళనలు జరిగాయి. కానీ ఏనాడూ ఇంత విధ్వంసం జరగలేదు. నీళ్ళ కోసమే ఇంత విద్వంసం జరుగుతోందంటే చాలా మంది రాజకీయ పరిశీలకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటు కర్ణాటకతో పాటుగా తమిళనాడులో కూడా అదే పరిస్థితి. కావేరీ నదీ జలాల కోసం కాక ఆ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాల పరువును రచ్చకీడ్చాలనే ఉద్దేశంతో  ఎవరో తెర వెనుక కుట్రలు పన్నుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఈ కుట్రల గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే రాజకీయ పార్టీల తీరును ప్రశ్నించాల్సి రావచ్చు. ముఖ్యంగా కర్నాటక నుంచి తమిళనాడుకి కావేరీ జలాలు అందుతున్నా కూడా నిరసనల పేరిట ఇంత విధ్వంసం జరుగుతోందంటే ఖచ్చితంగా దాని వెనుక ఎవరో కుట్రలు పన్నుతున్నారని అనుమానించక తప్పదు. కర్నాటకలో ఆందోళనకారులు ఇంతగా రెచ్చిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఈ సమస్య గురించి లేఖలు రాసి వారి సహకారం కోరారు.

కర్ణాటకలో తలెత్తిన ఈ హింసకు ఖచ్చితంగా రాజకీయ కోణంలేదు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ బెంగళూరు లాంటి నగరాల్లో కూడా పరిస్థితిని అదుపుచెయ్యలేకపోవడం అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతోంది. ఇక అసలే ఆత్మాభిమానం, ప్రాంతీయ వాదం బాగా ఉన్న తమిళనాట తంబీలు మాత్రం ఊరుకునే పరిస్థితిలేదు. కావేరీ జలాల వివాదం కోర్టు పరిధిలో ఉన్నా రెండు రాష్ట్రాల శాంతి భద్రతలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. కానీ బహుశా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి పరిస్థితిని అదుపు చెయ్యడానికి కాస్త ఆలోచనలో పడ్డట్లు అనిపిస్తోంది.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
జియోకు పోటీగా ఆర్‌కాం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?

Comments

comments