బస్సుల కోసం బుస్..బుస్

Private travels war between Srinivas Reddy and JC Prabhakar Reddy

ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య రెండు సంవత్సరాల క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండేది. కానీ తర్వాత మాత్రం పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే చాలా కాలం తర్వాత మరోసారి ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చు అనే హెడ్ లైన్స్ తో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే తెలంగాణ ఎమ్మెల్యేకు, ఏపి ఎమ్మెల్యేకు మధ్య జరిగిన వాగ్వివాదం చివరకు ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో వచ్చిన ఈ గొడవ చివరకు అరెస్టు దాకా వెళ్లింది. ఇంతకీ ఈ గొడవ ఎవరి మధ్యన అనేగా మీ ప్రశ్న. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఏపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ల మధ్య గొడవ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ చిచ్చు రాజేసింది.

ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లపై తిరుగుతున్న ప్రయివేటు బస్సులపై జేసీ బ్రదర్స్, శ్రీనివాస్ గౌడ్ ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లుంది. ఇటీవల శ్రీనివాసగౌడ్ ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. తెలంగాణ ప్రయివేటు బస్సులను ఆంధ్రలో తిరగనివ్వకుండా కొందరు బలవంతంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన నేరుగా జేసీ బ్రదర్స్ పైనే ఆరోపణలు చేశారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా దీటుగానే సమాధానమిచ్చారు. శ్రీనివాసగౌడ్ తెలంగాణలోని ప్రయివేటు బస్సుల యాజమాన్యాల వద్ద ముడుపులు తీసుకుని శాసనసభలో అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.

అయితే శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆరోపణల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగానే సమాధానం చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు సంబందించిన ఆధారాలతో ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి రావాలని, అక్కడ చర్చిద్దాం అని సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ప్రయివేటు ట్రావెల్స్ సమస్యలపై చర్చించేందుకు జేసీ వచ్చారు. ఈ సమావేశానికి శ్రీనివాసగౌడ్ కూడా వచ్చారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న బస్సుల పర్మిట్లు, రూట్లపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు జేసీ, గౌడ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు  విసురుకునే పరిస్థితికి చేరుకుంది. శ్రీనివాస్ గౌడ్ పై ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.మొత్తానికి రెండు సంవత్సరాల తర్వాత మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ విషయంలో ఉద్రిక్తతలు తలెత్తుతాయేమో అనే అనుమానాలు మాత్రం అంతకంతకు బలపడుతున్నాయి.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
జెండా తెచ్చిన తిప్పలు
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
తాగుబోతుల తెలంగాణ!
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
అంత దైర్యం ఎక్కడిది..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
కాశ్మీర్ భారత్‌లో భాగమే
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
2018లో తెలుగుదేశం ఖాళీ!
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఏపీకి ఆ అర్హత లేదా?
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
దేశభక్తి అంటే ఇదేనా?

Comments

comments