గుదిబండగా మారిన కోదండరాం

Professor Kodanda Ram became headache to TRS and KCR

తెలంగాణలో కేసీఆర్ కు, ఆయన పార్టీ టిఆర్ఎస్ కు తిరుగులేకుండాపోయింది. తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీని లీడ్ చేస్తూ కేసీఆర్ ఒక్కొక్క మెట్టుగా ఎదిగారు. అయితే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ తో కొంత మంది విభేదించి ఆయనకు దూరంగా ఉన్నారు. అలాంటి వాళ్లలో మొదటివ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జెఎసి చెర్మైన్ గా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం పరిస్థితులు మారాయి. కోదండరాం అప్పుడప్పుడు కేసీఆర్ మీద, తెలంగాణ సర్కార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్యన మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా జరిగిన ధర్నాకు మద్దతిచ్చి, కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

‘పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా పరిపాలన ఉండాలి. ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్‌ దగ్గరకు పోకుండా ఉంటమా? ఇప్పుడున్న డాక్టరు వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టరు వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’అని కోదండ‌రాం కాస్తంత వ్యాఖ్యానించారు. ప్ర‌జల‌ను ఇబ్బందుల‌కు గురి చేసే నిర్ణ‌యాలు తీసుకునే కేసీఆర్‌… ఇప్ప‌టికైనా త‌న వైఖ‌రిని మార్చుకోవాల‌ని, లేనిపక్షంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పి తీర‌తారంటూ అన్నారు. దీంతో కేసీఆర్, తెలంగాణ సర్కార్ మీద కోదండరాం తన అసమ్మతి గళాన్ని గట్టిగా వినిపించారు. అయితే దీన్ని టిఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. కోదండరాంకు గట్టిగానే సమాదానం చెబుతోంది టిఆర్ఎస్ పార్టీ.

కోదండరాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పనిచేస్తున్నరాని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంజెండాను ప్రచారం చేయడం తప్ప ప్రస్తుతం కోదండరాం చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా ఒక పథకం ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న మంచి పనులు ఈ ఆచార్యుడికి కనిపించడం లేదని అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వపు పథకాలను దేశం యావత్తూ మెచ్చుకుంటోందని అటువంటి తరుణంలో తమ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. కోదండరాం తన తీరును మార్చుకోని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.

ఇప్పటికైనా కోదండరాం ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. మొత్తానికి నాడు కేసీఆర్ తో కలిసి ఉద్యమించిన కోదండరాం గారు ఇప్పుడు అదే కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న ప్రభుత్వం మీద తీవ్రంగా వ్యాఖ్యానించడం రాజకీయ వేడిపుట్టిస్తోంది. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేకపోయినా కూడా భవిష్యత్తులో మాత్రం గండం ఉంది అనే సూచనలు మాత్రం కోదండరాం మాటల ద్వారా తెలుస్తోంది.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
వాళ్లను వదిలేదిలేదు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
బాకీలను రద్దు చేసిన SBI
అకౌంట్లలోకి 21వేల కోట్లు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
పవన్ పంచ ప్రశ్నలు
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments