పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు

Protest in PoK oppose for Pakistan

పాక్, భారత్ మధ్య సాగుతున్న కాశ్మీర్ వివాదం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ దే అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన సర్వత్రా ఉత్కంఠను నెలకొల్పింది. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో మోదీ దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా అందులో.. కాశ్మీర్ కు  సంబందించి మోదీ కీలకవ్యాఖ్యలు చేశారు. మరి మోదీ మాటలు విన్నారో లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు జరిగాయి.

గిల్గిత్-బాల్టిస్తాన్ యువత శనివారం ఉదయం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మానవ హక్కులను హరిస్తున్న పాకిస్థాన్ బలగాలు తక్షణమే తమ ప్రాంతాన్ని వదిలివెళ్లాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా యువకులు, స్థానిక రాజకీయ నేతలతో కలిసి వీధుల్లో నిరసన ర్యాలీలు కొనసాగించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పాక్ బలగాలు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నాయి. గిల్గిత్-బాల్టిస్థాన్ సరిహద్దుల్లో చైనా-పాక్ కారిడార్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో అక్కడి స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కారిడార్‌తో తమకేలాంటి ఉపయోగం ఉండకపోగా, ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిమంది నిర్వాసితులుగా మారుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
మా టీవీ లైసెన్స్ లు రద్దు
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
స్థూపం కావాలి
పిహెచ్‌డి పై అబద్ధాలు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
ఏపీకి ఆ అర్హత లేదా?
తిరిగబడితే తారుమారే
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
దివీస్ పై జగన్ కన్నెర్ర
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ

Comments

comments