పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు

pulirajas into kapu protest for there political milage

ఏ గేమ్ లో అయినా కూడా విన్నర్ వెంటే అందరూ పరుగెడుతుంటారు. గేమ్ ఛేంజర్ ఎంటర్ అయితే వెంటనే వాడి వెంట పది మంది నడుస్తుటారు. ఇప్పుడు ఏపిలో అచ్చం ఇలాంటి గేమ్ షోనే నడుస్తోంది. కాకపోతే ఇది కేవలం ఓ వర్గానికి చెందిన వాళ్ల గేమ్ షో మాత్రమే.నిన్నటి దాకా అది పెద్ద విషయం కాదు.. నాలుగు రోజులు దీని మీద చర్చ నడుస్తుంది తర్వాత దాన్ని వదిలేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన దీక్షను విరమించకపోవడం.. కిర్లంపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంతా ఉల్టా పుల్టా అయింది.

తాజాగా ముద్రగడ చేస్తున్న దీక్షతో దడ మొదలైంది. కొంత మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు దీన్ని తమ మైలేజ్ కింద వాడుకోవాలని రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాసరి నారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులాంటి వ్యక్తులను ముద్రగడ దడ పుట్టించారు. అందుకే ఇప్పటికైనా దీని మీద మాట్లాడకపోతే భవిష్యత్తులో అనుకోని నష్టంవాటిల్లుతుందని ముందే ఊహించి.. దాసరి నాయకత్వంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసి.. ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కరెక్ట్ గా లేదని వాళ్లు గట్టిగా వాదించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. కనీసం చిరంజీవి కాపు ఉద్యమం మీద, ముద్రగడ అరెస్టు మీద మాట్లాడారు. చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణలు మాత్రం నోరెత్తి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరి అలాంటి వాళ్లు ఉన్నట్లుండి.. మీడియా ముందుకు వచ్చి ఎందుకు హడావిడి చేస్తున్నట్లో ఆలోచించాలి. మీడియాలో కూడా కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. కొన్ని ఛానల్స్, పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తూ.. ఉద్యమ తీవ్రతను తక్కువ చేసి చూపించిన మాట కూడా గుర్తించాలి. కానీ దాసరి, చిరంజీవి, బొత్స, అంబటిలాంటి వాళ్ల ఎంట్రీతో కాపు ఉద్యమానికి మీడియా మరింత పాపులారిటీ వచ్చింది అన్నది మాత్రం వాస్తవం.

సరే అంతా బాగానే ఉంది.. మరి నిన్నటి దాకా కిమన్నకుండా ఉన్న వాళ్లు ఎందుకు అంతలా హడావిడి చేస్తున్నారో అందరికి తెలుసు. ఒకప్పుడు కేంద్రంలో హల్ చల్ చేసిన దాసరి తర్వాత బొగ్గు మసితో డల్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి కాపు కార్డుతో పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరంజీవి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. అసలే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అయినా కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కూరలో కరివేపాకులా చిరంజీవిని ట్రీట్ చేస్తున్నారట కాంగ్రెస్ నాయకులు. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఇలా కాపు కార్డును ఎత్తుకున్నారు అని అందరికి తెలుసు. ఇక మిగిలిన నాయకుల గురించి చెప్పక్కర్లేదు. పార్టీలో ఉండలేక.. బయటపడలేక వాళ్ల కష్టాలు వర్ణనాతీతం. మరి అలాంటి వాళ్లందరికి నీడనిచ్చే చెట్టు ఒక్క కులం మాత్రమే. అందుకే వాళ్లందరూ చేరారు. కాపులకు ప్రభుత్వం చెయ్యాల్సిన మేలు చెయ్యనందుకే ఈ ఉద్యమం మొదలైందని అందరికి తెలుసు.. ఈ ఉద్యమం వల్ల కొంత మందికి రాజకీయంగా మేలు కలుగుతోంది అని గమనించాలి.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పవన్ చంద్రుడి చక్రమే
చంద్రుడి మాయ Diversion Master
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
బాబు Khan
మూడింటికి తేడా ఏంటి..?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
మెరుపు దాడి... నిజమా-కాదా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments