నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?

fake

ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు… చూడచూడ రుచులు వేరు అన్నట్లు అసలు నోటు, నకిలీ నోటు చూడడానికి అచ్చం ఓకేలా ఉంటాయి. చాలా మంది నకిలీ నోట్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, శ్రీలంకల నుండి భారీగా నకిలీ కరెన్సీ దేశంలోకి వస్తోంది. కేంద్రం ఈ మధ్యన తీసుకువచ్చిన రెండు వేల రూపాయల కొత్త నోటును కూడా కొన్ని గంటల్లోనే నకిలీలు తయారు చేసి మార్కెట్ లోకి వదిలారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే అందరూ నకిలీ కరెన్సీ సప్లై చేస్తున్న వారిని అరెస్టు చేసిన వార్తలు చేసి ఉంటారు కానీ ఫేక్ కరెన్సీని సప్లై చేసిన వారికి ఎలాంటి శిక్ష వేస్తారో తెలిసి ఉండదు. అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తారంటే..

ఘజియాబాద్ కోర్టు తాజాగా నకిలీ నోట్లను సప్లై చేస్తున్న ముగ్గురు వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. ఆ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.  2012లో మొరాదాబాద్ రైల్వే స్టేషన్ లో నకలీ కరెన్సీని కలిగిన ఇద్దరు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన మొహబ్బత్ పూర్ కు చెందిన హమిదుల్ షేక్, నజీబుల్ హక్ అనే వ్యక్తుల నుంచి 8,49,500 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాయపూర్ జిల్లా శికర్ పూర్ గ్రామానికి చెందిన గుల్షన్ జహాన్ కు ఆ కరెన్సీని చేరవేయడానికి ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. నకిలీ కరెన్సీని సరఫరా చేసిన ఇద్దరికి ఘజియాబాద్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష 1.60 లక్షల ఫైన్ విధించింది. ఫేక్ కరెన్సీ సప్లై చేసే వాళ్లు ఈ దెబ్బతో అయినా అవన్నీ మానేస్తే బాగుండు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
ఆట ఆడలేమా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
గెలిచి ఓడిన రోహిత్ వేముల
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబు గారి అతి తెలివి
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
జియోకు పోటీగా ఆర్‌కాం
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments