పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి

PV Narasimha Rao The Great Person Who change the Indian Economy

దేశ ఆర్థిక గతిని మార్చిన ఓ మహానుభావుడికి చివరకు కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుండే ప్రధానిగా ఉన్నా కానీ పి.వి నరసింహారావు అనే గొప్పవ్యక్తికి ఘోర అవమానం జరిగింది. దిల్లీలో అంత్యక్రియలకు కూడా అనుమతించని.. సోనియాగాంధీ రాజకీయ అసూయ ఎంత ఉందో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ సాదించిన అరకొర మెజారిటీతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి ప్రధాని.. ఐదు సంవత్సరాల ఫుల్ టైం కొనసాగడం అప్పట్లో విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థను రెండుగా విభజిస్తే మాత్రం పివి రాకకు ముందు, పివి తర్వాత అని విభజించాల్సి వస్తుందేమో, ప్రస్తుతం భారత్ రెండు లక్షల కోట్ల బిలియన్ డాలర్ల ఫారెన్ కరెన్సీని కలిగి ఉంది అంటే అది కేవలం పివి నరసింహారావు చలవే అని అందరికి తెలుసు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన విశేషాలు మీ కోసం..

పి.వి. నరసింహారావు 21 జూన్ 1991 నుండి 16 మే 1996 దాకా భారతదేశ 10వ ప్రధానమంత్రిగా పనిచేశారు. పి.వి. ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగి పోయింది. ఇతర దేశాల్లో బంగారం కుదువపెట్టుకొని దేశమనే సంసారాన్ని వెళ్లదీసిన కాలమది. అలాంటి దశలో ప్రపంచీకరణ, సరళీక రణ, ప్రైవేటైజేషన్ అనే దృక్పథంతో భారతదేశాన్ని గట్టెక్కించడానికి ఆర్థిక నిపుణుడు డా॥ మన్మోహన్‌సింగ్ గారిని ఆర్థికశాఖ మంత్రిగా నియమించి పి.వి. సంస్కరణలను వేగవంతం చేశారు. పి.వి. నరసింహారావు దూరదృష్టి ఎంత గొప్పదో ఈ ఒక్క విషయం తేటతెల్లం చేస్తుంది. ప్రపంచీకరణ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవ డంలో పి.వి. దూరదృష్టి మహోన్నత మైనది. దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం పివిది. 28 జూన్ 1921న తెలంగాణ రాష్ర్టంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, లక్నేపల్లి గ్రామంలో శ్రీమతి రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పి.వి. జన్మించారు. వరంగల్ జిల్లాలో ప్రాథమిక విద్య ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు-రుక్మినమ్మలు పి.వి.ని దత్తత తీసుకున్నారు. దాంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. అలా కరీంనగర్ జిల్లా వంగర వాసిగా వినుతికెక్కారు.

స్వాతంత్రోద్యమ కాలంలో విద్యార్థిగా, యువకుడిగా అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థ, మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా ప్రాచుర్యం పొందారు. వారి అడుగుజాడల్లో ఎన్నికల రాజకీయాలలో అడుగుపెట్టి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో రాష్ర్ట మంత్రిగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రతి పదవిలో తనదైన ముద్ర వేసిన తీరు అపూర్వం. ఆయన సుప్రసిద్ధ సాహితీవేత్త కూడా. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. తన జీవితంలోకి రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ‘ఇన్‌సైడర్’ (లోపలి మనిషి) పేరుతో ప్రచురించారు. పి.వి. నరసింహారావు జీవితంలో ఎన్నో సవా ళ్లను ఎదుర్కొన్నాడు. వాటికి ఎప్పటికప్పుడు ప్రతిస్పందించ కుండా మౌనంగా, నిశ్శబ్దంగా పని చేసుకుంటూనే వెళ్లారు. కాలక్రమంలో ఆయా సమస్యలన్నీ పరిష్కారం లోకి వచ్చేవి. పి.వి. వెంటనే ఏ నిర్ణయా లు తీసుకోరని ఒక విమర్శ ఉండేది. అందుకు జవాబుగా ‘ఏ నిర్ణయం తీసుకోక పోవడం కూడా ఒక నిర్ణయమే’ అని ఆయన అన్నారు. ముఖ్యంగా భారతీయ ప్రజలు నెహ్రూ తరువాత పి.వి. నరసింహా రావును ఆర్థికరంగంలో రెండోదశకు ఆదుడుగా గుర్తుపెట్టు కుంటారు.

రాజీవ్ హత్య అనంతరం వెలువడిన ఎన్నికల ఫలితాలలో 247 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 272 సీట్లకు కూతవేటు దూరంలో నిలిచింది. లెఫ్ట్ పార్టీల మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసెందుకు పివి నరసింహారావుకు ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకుంది. అప్పటికి పివి అనే ఓ వ్యక్తి ప్రధానిగా రాజకీయ చతురతను చూపిస్తాడు అని ఎవరూ ఊహించలేదు. ఎన్నోసార్లు పివిని గద్దెదించేందుకు నాటి కాంగ్రెస్ నాయకులు, మిగిలిన వాళ్లు ప్రయత్నాలు చేసినా కానీ పివి వాటిని బాగా ఎదుర్కొన్నారు. పివికి అన్ని పార్టీలను ఏకం చేసినా కానీ ఓటింగ్ టైంలో మాత్రం ఓడిపోయేవాళ్లు… అలా పివి తనదైన ముద్రను వేసుకున్నారు.

పివి గురించి కొన్ని విషయాలు..

నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి. నరసింహారావు భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పాడు.

సోవియట్ యూనియన్ విచ్చిన్నంతో అమెరికా,రష్యా లలో ఎవరి వైపు భారత్ నిలబడాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు అమెరికా వైపే మొగ్గు చూపారు పీవీ. జనరేషన్ గ్యాప్ ఉన్నా అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తో సత్సంబంధాలు పెట్టుకొని భారత్ – అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు.

 –ఒకవైపు అమెరికాతో సత్సంబంధాలు నెరుపుతూనే మరోవైపు “లుక్ ఈస్ట్ పాలసీని” ప్రవేశపెట్టి ఆసియాన్ దేశాలతో భారత సంబంధాలను పటిష్టం చేసుకొనెందుకు పీవీ దోహదం చేసారు

 –సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌రాష్ర్టంలో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్‌లు కల్పించారు

ఆయన ప్రధానమంత్రిగా ఉన్న హయాంలోనే వి.పి.సింగ్ ప్రవేశ పెట్టిన బిసిల రిజర్వేషన్‌ను అమలుజరిపే అవకాశం వచ్చింది.

మండల కమిషన్ సిఫారసుల మేరకు దేశంలోనే మొదటిసారిగా 1993లో బిసిలకు కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌లను అమలు జరిపిన ఘనత ఆయనదే.

జవహర్ నవోద య విద్యాలయాలను ప్రారంభించారు.

త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఉత్తర భారత దేశంలోని అనేక నవోదయ పాఠశాలల్లో తెలుగును పాఠ్యాం శంగా నేటి కీ చదువు తున్నారంటే, తెలుగు పండిట్ లు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పనిచేస్తున్నారంటే అదంతా పి.వి. గారి ముందు చూపు వల్లనే సాధ్యపడింది.

జేఎంఎం ముడుపుల కేసు,సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు,లఖుబాయ్ పాఠక్ చీటింగ్ కేసు లాంటివి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని పదవి నుంచి దిగిపొమ్మన్నప్పుడు కూడా పివిని ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే అయినా కూడా సోనియాగాంధీకి మాత్రం పివి అంటే ముందు నుండి ఓ చిన్న చూపు. నిజానికి విపి మహా అయితే రెండు సంవత్సరాలు మాత్రం అధికారంలో ఉంటారని అనుకుంటే ఏకంగా ఐదు సంవత్సరాలు కొనసాగడం అప్పట్లో సెన్సేషన్.

పివి నరసింహారావు పార్థివ దేహానికి దిల్లీలో మిగిలిన ప్రధాన మంత్రుల తరహాలోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా కూడా సోనియాగాంధీకి ఇష్టంలేని కారణంగా హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు

కాంగ్రెస్ కు చెందిన సీనియర్లు ఎవరు చనిపోయినా కూడా దిల్లీలోని 10జన్పథ్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉంచి, కార్యకర్తలకు సందర్శించే అవకాశం ఇస్తారు. కానీ పివి శవాన్ని ఊరించిన టైంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళాలు వేయించారు సోనియా గాంధీ “

ఇలాంటి మహనీయునికి ఎవరూ కోరకుండానే ‘భారతరత్న’ ప్రకటిం చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్, పి.వి. నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం ద్వారా తెలంగాణ కీర్తిపతాకాన్ని దేశదేశాల్లో ఎగురేయాలని కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాలలో పి.వి.గారి జీవితచరిత్రను చేర్చడం అభినందనీయం. అలాగే అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నది. జాతీయస్థాయిలో కూడా ఎన్‌డిఏ ప్రభుత్వం ఢిల్లీలో యమునా నదీ తీరాన పి.వి. స్మారక చిహ్నం నిర్మించడానికి పూనుకోవడం, తన విజ్ఞత ను ప్రదర్శించుకోవడం ప్రశంసనీయం. దక్షిణాది రాష్ట్రాల నుండి తొలి ప్రధాని పి.వి. నరసింహారావు భారత చరిత్రలో ఒక మహోన్నతమైన అధ్యాయాన్ని సృష్టించారు. పి.వి. కి ముందు, పి.వి.కి తరువాత అనే విధంగా భారతదేశ చరిత్ర, సామాజిక, రాజకీయ పరిణామాలు మలుపు తీసుకున్నాయి. దేశం గర్వించ దగిన ప్రధానమంత్రులలో ఒకరిగా చరిత్రలో నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి. నరసింహారావు చిరస్మరణీయులు. పి.వి. డిసెంబర్ 23, 2004లో కన్ను మూశారు.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
ఇదే జగ‘నిజం’
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
చెత్త టీంతో చంద్రబాబు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments