అరుపే గెలుపు

shout

పివి సింధు.. ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు. బ్యాడ్మింటన్ లో రియో ఒలంపిక్స్ సాక్షిగా ఫైనల్ కు చేరిన భారత క్రీడాకారిణి. ఒలంపిక్స్ లో సింగిల్ గా ఫైనల్ కు చేరిన మొదటి క్రీడాకారిణిగా కూడా పివి సింధు రికార్డుకెక్కారు. పివి సింధు తన గురువు పుల్లెల గోపీచంద్ దగ్గర కోచింగ్ తీసుకుంది. బ్యాడ్మింటన్ పై తన గురువు 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ గెలుపు ఆమెకు స్పూర్తినిచ్చింది. 2003లో పుల్లెల గోపీచంద్ స్టార్ట్ చేసిన కోచింగ్ సెంటర్ లో చేరి ఇప్పుడు ఒలంపిక్స్ వేదికగా తన సత్తాను చూపిస్తోంది.

పుల్లెల గోపీచంద్ తన దగ్గర కోచింగ్ కు వచ్చిన విద్యార్థుల శక్తిసామర్థ్యాలను దృష్టిలోపెట్టుకొని అవకాశాలిస్తుండేవాడు. అలా సైనా నెహ్వాల్ ను కత్తిలా తయారు చేసి క్రీడాలోకానికి అందించారు. సైనా నెహ్వాల్ తర్వాత ఇప్పుడు పుల్లెల సంధించిన మరో అస్త్రం పివి సింధు. 2003 నుండి పివి సింధుకు కోచింగ్ ఇస్తూ వచ్చిన గోపీచంద్.. సింధులో క్రీడాజ్వాలను చూశాడు. ఆమె గత రెండు సంవత్సరాలుగా పెద్దగా సాధించిన విజయాలేమీ లేవు. అసలు లోపం ఎక్కడ ఉందా అని ఆయన విశ్లేషించాడు. అత్యుత్తమ ఆటగాళ్లకు ఈమెకు ఉన్న తేడా ఏంటో కనిపెట్టాడు.

ప్రతి మనిషిలో సాధించాలి అన్న తపన ఉంటుంది. కానీ క్రీడల్లో మాత్రం ఆ తపనను బయటకు తియ్యాలి. అలా పివి సింధులోని ఆ తపనను బయటకు తీసేందుకు  వాడిన సాధనం ‘అరుపు’. అందుకుగాను ఆమెకు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా.. అరవడం కూడా నేర్పించాడు.పివి సింధును కోర్ట్ మధ్యలో నిల్చోబెట్టి.. చుట్టూ చిన్నారి ఆటగాళ్లను కూర్చోబెట్టేవారు గోపీచంద్. తర్వాత పివి సింధును అకాడమీ మొత్తం దద్దరిల్లేలా అరవమని చెప్పేవాళ్లు. ఇలా చాలా రోజులు ప్రాక్టీస్ చేయించారు. దీనిలో అసలు విషయం ఏంటంటే… అలా అరవడం వల్ల పాయింట్ పాయింట్ కు కసి పెరుగుతుంది. ఇంకా సాధించాలి అనే తపన పెరుగుతుంది. అలాగే ప్రత్యర్థిలో ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీయవచ్చు.

రియో ఒలంపిక్స్ వేదికగా సింధు చేసిన సింహ గర్జన ఆమెను బంగారు పతకానికి చేరువ చేసింది. ఆమె అరిచిని ఒక్కో అరుపు.. భారతీయు కళ్లలో ఆనందాన్ని పుట్టించాయి. పుల్లెల గోపీచంద్ ఎంతలా విజన్ ఉంటే మాత్రం తన శిష్యుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇలా బయటకు తీసి.. ప్రపంచ వేదిక మీద భారత్ కు కీర్తిపతాకాలు తెస్తారు! పుల్లెల గోపీచంద్ స్ట్రాటజీకి నిజంగా సలాం చెయ్యాల్సిందే. సింధు ఫైనల్ లో కూడా ఇలానే సింహ గర్జన చేసి బంగారు పతకంతో తిరిగి ఇండియాకు రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Related posts:
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments