పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు

PV SIndhu won silver medal in rio Olympics but she won 125 crore Indians

యావత్ భారతం గుక్కతిప్పుకోకుండా చూసిన క్షణాలు. కోట్ల కళ్లు కనురెప్పవేయకుండా చూసిన ఎదురుచూపులు ఓరకంగా కాస్త నిరుత్సాహ పరిచినా కానీ అందరిలో ఓ ఆనందం. తనివి తీరా.. చివరి క్షణం వరకు గెలిచేందుకు పివి సింధు చేసిన పోరాటానికి భారతీయులు ఫిదా అయ్యారు. క్రికెట్ లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుందో…ఒలింపిక్స్ లో సింధు- క‌రోలినా మ్యాచ్ కూడా అంతే హోరా హోరీగా జ‌రిగింది.

వర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ క‌రోలినా త‌న స్తాయికి త‌గ్గ‌ట్టుగానే తొలి సెట్ ..ఫ‌స్ట్ హాఫ్ లో జోరు చూపించింది. సిందు ఏ మాత్రం త‌గ్గ‌కుండా పోరాట‌ప‌టిమ చూపించి ..ఒక్క‌సారిగా పంజుకుంది. 52 షాట్స్ తో సాగిన భారీ ర్యాలీ హైలైట్ గా నిలిచింది. ఈ ర్యాలీలో సింధు పాయింట్ సాధించింది. ఇక 19-16 స్కోరుతో లీడింగ్ లో ఉన్న క‌రోలినా తొలి సెట్ గెలిచిన‌ట్టే అనుకుంది. కానీ ఇక్క‌డే సింధు అద్భుతంగా పోరాడి వ‌రుసగా 5 పాయింట్లు సాధించి 21-19తో తొలి సెట్ ను గెలుచుకుంది. రెండో సెట్ లో క‌రోలినా మ‌రింత‌ దూకుడుగా ఆడి పూర్తి ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. త‌న‌దైన డ్రాప్ షాట్స్ తో సింధును కంగారుపెట్టింది. వ‌రుస‌గా పాయింట్లు సాధిస్తూ రెండో సెట్ ను 21-12 తేడాతో కైవ‌సం చేసుకుంది.

ఇక డిసైడ‌ర్ సెట్…మూడో సెట్ లోనూ ఫ‌స్ట్ హాఫ్ లో క‌రోలినా జోరు కొన‌సాగింది. ఐతే క‌రోలినా 7-3తో లీడ్ లో ఉన్న… సింధు అనూహ్యంగా పుంజుకుంది. భారీ ర్యాలీతో స్కోర్ ను 10-10కి స‌మం చేసింది. ఆ త‌ర్వాత మారిన్ స్మాష్ ల‌తో విజృంభించింది. మ‌రో ఎండ్ లో సింధు పోరాటం కొన‌సాగించింది. స్కోరు 18-14 తో ఉన్న‌పుడు సింధు త‌ప్పిదంతో …మారిన్ కు మ‌రో పాయింట్ ద‌క్కింది. ఆ త‌ర్వాత మారిన్ కు విజ‌యం లాంఛ‌న‌మైంది. ఐతే ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన పోరాట‌ప‌టిమ క‌న‌బ‌రిచిన సింధును యావ‌త్ భార‌త్ ప్ర‌శంసిస్తోంది. ఒలంపిక్స్ లో తొలి రజతం గెలిచిన తొలి భారతీయ మహిళగా పివి సింధు రికార్డుకెక్కింది. పివి సింధు ఆటకు తెలుగోడ మనసారా అభినందనలు తెలుపుతోంది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments