కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?

Rahul gandhi and Arvind Kejriwal doing politics is good

దేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ మోదీ మీద విమర్శలు వచ్చాయి అంటే అది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గొంతు నుండే అని ఇప్పటికి చాలా మందిలో నమ్మకం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేస్తూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ సిఎం అయిన తర్వాత మాత్రం మోదీని టార్గెట్ గా చేసుకున్నారు. ఇక ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎలాగూ మోదీని విమర్శిస్తూనే ఉంటారు. తాజాగా వీరిద్దరు కలిసి మోదీ మీద తెగ విరుచుకుపడుతున్నారు. అసలు మోదీ సర్కార్ కు ఏం చేతకాదు అని హడావిడి ప్రకటనలు చేస్తున్నారు, ఇంతకీ ఈ ఇద్దరు ఇంతలా రెచ్చిపోవడానికి, మోదీని విమర్శించడానికి కారణం ఏంటి అంటారా..? వన్ ర్యాంక్-వన్ పెన్షన్.

మాజీ ఆర్మీ ఉద్యోగులకి “వన్ ర్యాంక్-వన్ పెన్షన్’ అమలుచేయనందుకు నిరసనగా హర్యానాలోని భివానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి రామకిషన్ గ్రేవాల్ దిల్లీలో జంతర్ మంతర్ వద్ద విషం త్రాగి ఆత్మహత్య చేసుకొంటే, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వారిని నియంత్రించడానికి పోలీసులు కస్టడీలో తీసుకోవలసి వచ్చింది. అయ్యవార్లు చేసిన హడావిడికి దిల్లీకి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అరవింద్ కేజ్రీవాల్ ను, ఎప్పటికైనా ప్రధాని అవ్వాలని కలలు కంటున్న రాహుల్ గాంధీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే చాలా విషయాల్లో మోదీతో విభేదించిన అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు మరోసారి ఆర్మీ ఉద్యోగుల పెన్షన్ విషయంలో మోదీ మీద ఒంటికాలుపై లేస్తున్నారు. అయితే ఇలా వీరిద్దరు రెచ్చిపోయి ప్రకటనలు, హడావిడి చెయ్యడానికి కారణాలు లేకపోలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న యూపి, పంజాబ్ రాష్ట్రాల నుంచే  ఆర్మీలో అత్యధిక సంఖ్యలో జవాన్లు, సైనికాధికారులు ఉన్నందున, వారందరిని ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పోగేసుకోవాలంటే ఆ మాత్రం డ్రామాలు ఆడక తప్పదని వారు భావిస్తున్నట్లున్నారు.

ఇక ఈ మొత్తం అంశాలను ఎలాగూ నేషనల్ మీడియా బాగా కవరేజ్ చేస్తోంది. దీన్నే బేస్ చేసుకొని ఎన్నికల్లో ఓట్ల కోసం జోలెపట్టుకోవచ్చు అని బహుశా అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఆలోచిస్తూ ఉండవచ్చు. అందుకే ఎవరు ఏ అవకాశం వచ్చినా కానీ వెంటనే దాన్ని మీడియా ముఖంగా తెగ హడావిడి చేస్తూ ఓట్ల రూపంలో దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాను కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించేశారు. అయినా కేజ్రీవాల్ ఇలా కోటి రూపాయలు ప్రకటించడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఇలా మరికొంత మంది ఆర్మీ జవాన్లు గనక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు కూడా వారికి ఇదే కోటి రూపాయల నష్టపరిహాన్ని కేటాయిస్తారా..? అంటే అది అరవింద్ కేజ్రీవాల్ వల్ల సాద్యమో కాదో దేశం మొత్తం తెలుసు.

మోదీ ఛాతిని చూసి నాడు భయపడిపోయిన రాహుల్ గాంధీ ఇప్పుడు దిల్లీ వేదికగా రొమ్మువిరుస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు రావడం మామూలే కానీ వీటి వల్ల రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం మైలేజ్ రాదు అన్న విషయాన్ని గుర్తించాలి. కానీ ఇక పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చి చెపుతున్నాయి కనుక వాటిని ఇంకా మెరుగు పరుచుకోవాలంటే ఇటువంటి డ్రామాలు ఇంకా ఎన్నైనా ఆడక తప్పదు. అందుకే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ నిన్న అతని అంత్యక్రియలకి కూడా హాజరయ్యారు. ఆర్మీ జవాను అంత్య క్రియలను నిలిపి వేసేలా చేసి మరీ రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు అనే వార్త వినిపిస్తోంది. దేశానికి రాహు, కేతువుల మాదిరి మారిన అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ చేస్తున్నది మంచి రాజకీయమేనా అని చాలా మంది భావన.

Related posts:
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
అడకత్తెరలో కేసీఆర్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
అన్నదమ్ముల సవాల్
బాబు Khan
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments