రాహుల్ గాంధీ ఊరించేదేనా?

Rahul Gandhi cant get credit on Demonetisation

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ మీద చిర్రెత్తిపోతున్నారు. కాంగ్రెస అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలకు దూరమైన తర్వాత రాహుల్ గాంధీ స్వింగ్ లోకి వచ్చారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నోట్ల ర‌ద్దుపై మెల్ల‌మెల్ల‌గా వాయిస్ పెంచుతున్నారు. తాను నోరు తెరిస్తే భూకంప‌మే అన్న ద‌గ్గ‌ర్నుంచి మోదీ త‌న‌ను చూసి భ‌య‌ప‌డుతున్నారనే వ‌ర‌కు ఆయ‌న దాడి, దూకుడు కొన‌సాగుతోంది. ఇపుడు మోదీపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసి సంచ‌ల‌నానికి తెర లేపారు. మోదీ అవినీతి గుట్టంత త‌న‌కు తెలుస‌న్నారు.

అవును మ‌రీ.. రాహుల్ ద‌గ్గ‌ర మోదీ అవినీతి గుట్టు ఉంటే.. దానిని బ‌య‌ట‌పెట్టాలి. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దుపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను వాడుకుంటూనే మోదీపై వ్య‌తిరేక‌త‌ను పెంచే ప్ర‌య‌త్నం చేయాలి. అందుకు రాహుల్ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాలు ఉప‌యోగ‌ప‌డుతాయి. కానీ రాహుల్ ద‌గ్గ‌ర ఏముంద‌న్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. అయితే అన్ని ఆధారాలను సభలోనే బయటపెడతానంటున్నారు. రేపటితో సమావేశాలు ముగుస్తాయి. మరి అప్పటికి చర్చ జరగకపోతే.. రాహుల్ గాంధీ మోదీ అవినీతి గుట్టును బయటపెట్టరా..! బీజేపీ నేతలు మాత్రం మోదీపై ఆరోపణలను నిరూపించాలంటున్నారు. మరి రాహుల్ ఆరోపణలు అయితే చేశారు… మరి వాటిని ప్రూవ్ చేయగలరా..? అయితే రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల అప్పటికప్పుడు మీడియాలో హడావిడి కనిపించినా కానీ రాహుల్ కు కలిసివస్తున్నదైతే ఏమీలేదు.

Related posts:
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
వాళ్లను వదిలేదిలేదు
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
సల్మాన్ ను వదలని కేసులు
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
నారా వారి అతి తెలివి
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
ఆ సిఎంను చూడు బాబు...
అమెరికా ఏమంటోంది?
తిరిగబడితే తారుమారే
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
కేసీఆర్ మార్క్ ఏంటో?
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
యాహూ... మీ ఇంటికే డబ్బులు
పాపం.. బాబుగారు వినడంలేదా?
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments