డబ్బు మొత్తం నల్లధనం కాదు

Rahul Gandhi excellent statements on black money

దేశం మొత్తం నల్లధనం, డీమానిటైజేషన్ మీదే చర్చించుకుంటోంది. పార్లమెంట్ దగ్గరి నుండి నడివీధుల వరకు అన్ని చోట్ల మోదీ గురించే ప్రస్తవన. అసలు మోదీ ఏం చేస్తున్నారు? ప్రజలకు కష్టాలు తీరతాయా? నల్లధనం దాచిన కుబేరుల వివరాలు బయటకు వస్తాయా? మోదీ ఇందులో గెలుస్తాడా? అని ఇలా సవాలక్ష ప్రశ్నలు. అయితే మోదీ మాత్రం అన్నింటికి ఒకటే సమాధానం చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మార్పును గమనిస్తారు… నల్లధనం మీద మోదీ చేస్తున్న ఈ ప్రయత్నం మీద ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే మోదీ చేస్తున్న నల్లధనం మీద యుద్ధం గురించి కాకుండా నల్లధనం పేరుతో సామాన్యులకు కలిగిస్తున్న ఇబ్బందుల మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

తాజాగా ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మోదీ మౌనంగా ఉండటం మీద రాహుల్ గాంధీ ముందు నుండి కోపంతో ఊగిపోతున్నారు. అయితే రాహుల్ గాంధీ నల్లధనం గురించి ఓ వ్యాఖ్య చేశారు. ఉన్న డబ్బంతా నల్లధనం కాదని, అలాగని నల్లధనం మొత్తం కేవలం డబ్బుల రూపంలో లేదని ఆయన అన్నారు. అలాగే బ్యాంకుల్లో ఉన్న డబ్బు కూడా నల్లధనం కాదు అనుకోవడానికి వీలులేదు అన్నారు. అయితే మోదీ ఈ విషయాలను గమనించాలని, ముందుగా సామాన్యులు పడుతున్న కరెన్సీ కష్టాలను తీర్చాలన్నదే తమ ఆకాంక్ష అని రాహుల్ అన్నారు. అయితే ఏఐసీసీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ గాంధీ చాలా పరిణతితో మాట్లాడారు అని వారు అభిప్రాయపడ్డారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
ఆట ఆడలేమా..?
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments