రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం

Rahul gandhi getting ready for AICC President Post

దేశంలో బలమైన పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి. స్వతంత్రం సిద్ధించిన తర్వాత రెండు పర్యాయాలు తప్ప అన్ని సార్లూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే దేశాన్ని ఏలింది. అలాంటి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపించిన సోనియాగాంధీ ఇప్పుడు తన కొడుకు రాహుల్ గాంధీని  దేశ ప్రధానిగా చూడాలనుకుంది. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీని ప్రధాని పీఠం కాకున్న కనీసం ఏఐసీసీ ప్రెసిడెంట్ గద్దెనెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇన్నాళ్ళకి లైన్ క్లియర్ అయ్యింది. ఏఐసీసీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా దీన్ని పార్టీ వర్గాలు రాహుల్ గాంధీకి పట్టంకట్టేపని కింద మలుచుకున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ లేకపోవడంతో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో సి.డబ్ల్యూ.సి. సమావేశం జరిగింది. దానిలో మాజీ కేంద్రమంత్రి సీనియర్ నేత ఎకె అంథోని రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతిపాదించగా సమావేశంలో పాల్గొన్న నేతలు అందరూ ఆయనకి మద్దతు ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది జూన్-జూలై నెలల మద్య పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. కనుక అంతవరకు సోనియాగాంధీ యే పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతారు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని నిర్దేశించే ఇటువంటి కీలకమైన సమావేశం సోనియాగాంధీ లేకుండా జరుపడం చాలా విచిత్రంగానే ఉంది. ఆమె తన ముద్దుల కొడుకుని ప్రధానమంత్రిని చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ వీలుపడలేదు. కనీసం పార్టీ అధ్యక్ష కుర్చీలోనైనా కూర్చోవాలని రాహుల్ గాంధీ తహతహలాడారు. కానీ అదీ ఇంతవరకు సాధ్యం కాలేదు. చివరికి హటాత్తుగా ఇవ్వాళ్ళ ఆయనకి ఆ భాగ్యం కల్పించేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఇదివరకు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోమన్నప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆలస్యం కారణంగా నరేంద్ర మోదీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలిచి, ప్రధాని పదవిని గద్దలా తన్నుకుపోయారు. దాంతో రాహుల్ గాంధీకి తీవ్ర నిరుత్సాహం కలిగింది. తాజాగా రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల నాటికి బలమైన నాయకుడుగా చూపించడానికి, ఏఐసీసీ ప్రెసిడెంట్ గా నియమించి, అన్ని రకాలుగా సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ మిల్కీబాయ్ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే, సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
అతడికి గూగుల్ అంటే కోపం
కాటేసిందని పాముకు శిక్ష
సైన్యం చేతికి టర్కీ
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
తెలంగాణకు ప్రత్యేక అండ
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
గాలిలో విమానం.. అందులో సిఎం
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
అందుకే భూకంపం రాలేదట
యాహూ... మీ ఇంటికే డబ్బులు
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments