ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్

Rahul gandhi one more time attacked on modi

సామాన్యులు నోట్లు దొరక్క నానాకష్టాలుపడుతుంటే…. నాయకులు మాత్రం దీని మీద తీవ్రంగా వాదులాడుతున్నారు. పార్లమెంట్ లో మోదీ మాట్లాడటం లేదని ప్రతిపక్షాలు, అసలు ప్రతిపక్షాలే మాట్లాడనివ్వడంలేదని మోదీ తెగ హైరానా చేస్తున్నారు. అయితే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాటల తూటాలు సంధిస్తున్నాడు. మోదీని టార్గెట్ గా చేస్తూ ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చారు.

దేశంలో ఉన్న డబ్బంతా నల్లధనం కాదు..నల్లధనం అంతా డబ్బు రూపంలో లేదన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్థిక కుంభకోణంతో పోల్చారు రాహుల్. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా ర్యాలీ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ర్యాచ్ సభలో ప్రధాని మోడీపై అవినీతి ఆరోపణలు చేశారు రాహుల్. డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో నిల్చున్న వాళ్లంతా బ్లాక్ మనీ హోల్డర్స్ కాదని అన్నారు రాహుల్. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం కొద్దిరోజులకే బ్లాక్ మనీ హోల్డర్స్ అంతా రోడ్లపై నిల్చున్నారని ప్రధాని మాట్లాడటం విడ్డూరం అన్నారాయన.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
అమ్మకు ఏమైంది?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
అకౌంట్లో పదివేలు వస్తాయా?
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
చెబితే 50.. దొరికితే 90
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
జయ మరణం ముందే తెలుసా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments