ఆయన మాట్లాడితే భూకంపం

Rahul Gandhi pronounce most awesome joke

దేశంలో భూకంపం రానుంది. అవును అయితే అది మామూలుగా వచ్చే భూకంపం కాదు… రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు వచ్చే భూకంపం. అవును అవును ఆయన నోరు విప్పి మాట్లాడటం మొదలుపెడితే భూకంపం వస్తుందట. ఇంతవరకు భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఈ నోట్ల రద్దు…. నోట్ల రద్దు వలన ఎవరికి లాభం కలుగుతోందో ఎవరికీ నష్టం కలుగుతోందో నేను మాట్లడాలనుకొన్నాను… కానీ పార్లమెంటులో మోడీ మాట్లాడారు నన్ను మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే తాను నోరు విప్పితే భూకంపం వస్తుంది అని ఏఐసీసీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

దానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చాలా దీటుగా జవాబిచ్చారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో నల్లధనం వెలికితీసి అవినీతిని పారద్రోలుతామని ముందే చెప్పాము. ఇప్పుడు అదే చేస్తుంటే కొందరు మాకు అడ్డుపడుతున్నారు. నల్లధనం వెలికి తీస్తుంటే వారు ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రజలకి చెప్పాలి. అవినీతి, కుంభకోణాల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దాని హయంలో 2జి,3జి స్కాంలు, స్పెక్ట్రం స్కాం, కామన్ వెల్త్ స్కాం, బొగ్గుగనుల స్కాం, యుద్ద విమానాలు, నౌకలు  కొనుగోలులో స్కాం, బియ్యం, గోధుమలు, పప్పులు, ఉప్పులు, యూరియా ఇదీ అదని లేదు ప్రతీ దానిలో స్కాంలు జరిగిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ కుంభకోణాలన్నిటికీ కేంద్ర బిందువు కాంగ్రెస్ పార్టీయే. గత 60 ఏళ్ళుగా ఇన్ని కుంభకోణాలలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భూకంపం సృష్టిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది,” అని ఎద్దేవా చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ కష్టపడి ఓ సంచలన వ్యాఖ్య చేసినా కానీ దాన్ని బీజేపీ నాయకులు నీరుగారుస్తున్నారు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
బాబోయ్ బాబు వదల్లేదట
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
జగన్ అన్న.. సొంత అన్న
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నయీం బాధితుల ‘క్యూ’
తెలంగాణకు ప్రత్యేక అండ
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
అమ్మ పరిస్థితి ఏంటి?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments